పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి దేవాలయం
Sri Venkateswara Temple - Penn Hills 01.jpg
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:పెన్సిల్వేనియా
ప్రదేశం:పెన్ హిల్స్‌
అక్షాంశ రేఖాంశాలు:40°26′28″N 79°48′19″W / 40.441001°N 79.805182°W / 40.441001; -79.805182
ఇతిహాసం
సృష్టికర్త:ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ
వెబ్ సైట్:www.svtemple.org#/

పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి దేవాలయం, అమెరికా, పెన్సిల్వేనియాలోని పెన్ హిల్స్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం.[1] పిట్స్‌బర్గ్ మెట్రోపాలిటన్ ఏరియాలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల నమూనాగా ఈ దేవాలయం రూపొందించబడింది. 2014 నాటికి ఈ ప్రాంతంలో దాదాపు 10,000 మంది హిందువులకు సేవలందించింది.[2] ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది సభ్యులు ఉన్నారు.

చరిత్ర[మార్చు]

1973లో పిట్స్‌బర్గ్‌లోని హిందూ టెంపుల్ సొసైటీ స్థాపించబడింది. 1974లో న్యూయార్క్‌లోని నేషనల్ హిందూ టెంపుల్ సొసైటీ నుండి 400,000 డాలర్ల నిధులను పొందింది. 1976, జూన్ 30న గ్రౌండ్‌బ్రేకింగ్ వేడుక జరిగింది. మరుసటి రోజు ప్రారంభించబడింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర దేవాలయాన్ని తలపించేలా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.[3] 2011లో, ఈ దేవాలయం 15,000 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్‌లు, ఆభరణాలను దొంగిలించబడ్డాయి.[4]

రూపకల్పన[మార్చు]

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఈ దేవాలయాన్ని రూపొందించింది. దేవాలయం రెండు వైపులా, మధ్యలో రెండు చేతులు, తలకు ప్రతీకగా ఒక గోపురంతో రూపొందించబడింది. దేవాలయం కింది అంతస్తులో ఫలహారశాల ఉంది.[5]

మూలాలు[మార్చు]

  1. "Sri Venkateswara Temple". pghcitypaper. Retrieved 2022-04-04.
  2. "Indian Immigrants Make Their Mark On Pittsburgh Religious Landscape". post-gazette. 9 November 2014. Retrieved 2022-04-04.
  3. Reid R Frazier (28 April 2005). "Temple gets "Indianization"". triblive. Retrieved 2022-04-04.
  4. "Police Investigate Robbery at Hindu Temple". pittsburghCBSLocal. 17 March 2011. Retrieved 2022-04-04.
  5. Madmax673. "Vankateswara Temple Canteen Pittsburgh". pitstburghindia. Retrieved 2022-04-04.