Jump to content

పిల్లల్లారా పాపల్లారా

వికీపీడియా నుండి

పిల్లల్లారా పాపల్లారా అనేది ఒక దేశభక్తి గేయం.[1]

పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా | | పిల్లల్లారా పాపల్లారా | |
మీ కన్నుల్లో పున్నమి జాబిల్లి ఉన్నాడు
పొంచి ఉన్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు
అతడున్నాడు | | పిల్లల్లారా పాపల్లారా | |
భారత మాతకు ముద్దుపాపలు మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతులేని ప్రేమేలే | | పిల్లల్లారా పాపల్లారా | |
భారతదేశము ఒకటే ఇల్లు భారతమాతకు
మీరే కళ్ళు జాతి పతాకము పైకెగరేసి
జాతి గౌరవము కాపాడండి
బడిలో బయట అంతా కలిసి
భారతీయులై మెలగండి
కన్యాకుమారికి కాశ్మీరానిని
అన్యోన్యతను పెంచండి
వీడని బంధము వేయండి | | పిల్లల్లారా పాపల్లారా | |

మూలాలు

[మార్చు]
  1. Kumar, Penta Sanjay. Sankalpam - TB. Saraswati House Pvt Ltd.