Jump to content

వర్గం:దేశభక్తి గేయాలు

వికీపీడియా నుండి

మా తెలుగుతల్లి


మా తెలుగుతల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

।।మా తెలుగు।।

గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి

।।మా తెలుగు।।

అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లీ! జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

-- శంకరంబాడి సుందరాచారి.

వర్గం "దేశభక్తి గేయాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 2 పేజీలలో కింది 2 పేజీలున్నాయి.