Jump to content

పి.ఆర్.నటరాజన్

వికీపీడియా నుండి
పి.ఆర్.నటరాజన్
పి.ఆర్.నటరాజన్


పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019-ప్రస్తుతం
ముందు పి. నాగరాజన్
నియోజకవర్గం కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2014
ముందు కె. సుబ్బరాయన్
తరువాత పి. నాగరాజన్
నియోజకవర్గం కోయంబత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-21) 1950 డిసెంబరు 21 (వయసు 73)
కోయంబత్తూరు, తమిళనాడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామి ఆర్. వనజ
నివాసం కోయంబత్తూరు
31 ఆగస్టు, 2019నాటికి

పి.ఆర్. నటరాజన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. కోయంబత్తూరు నియోజిక వర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్ (సి.పి.ఐ. (ఎం) తరుపున 17వ లోక్‌సభలో సభ్యునిగా ఉన్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

పి.ఆర్. నటరాజన్ 1950, డిసెంబరు 21న పి.వి.రామస్వామి, మంగలాంబాల్ దంపతులకు కోయంబత్తూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నటరాజన్ 1981, ఏప్రిల్ 5న ఆర్. వనజను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

పి.ఆర్. నటరాజన్ 2009లో తమిళనాడు కోయంబత్తూరు నియోజిక వర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్ (సి.పి.ఐ. (ఎం) తరుపున 17వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌ను 1.79 లక్షల ఓట్ల తేడాతో ఓడించి తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[2] పి. ఆర్. నటరాజన్ ఈ ఎన్నికల్లో సుమారు 571,150 ఓట్లు సాధించాడు.[3] 2009 ఎన్నకల్లో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఆర్. ప్రభును 35,000 ఓట్ల తేడాతో ఓడించాడు.[4]

పి.ఆర్.నటరాజన్ ను పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను 2023 డిసెంబరు 14న శీతాకాల సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి సస్పెండ్ చేశారు.[5]

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20190831103138/http://164.100.47.194/loksabha/members/MemberBioprofile.aspx?mpsno=4543
  2. "Coimbatore Election Result 2019: P R Natarajan of CPI (M) wins the LS Seat". Times of India. Coimbatore. 24 May 2019. Retrieved 1 April 2021.
  3. Madhavan, Karthik (28 May 2019). "P.R. Natarajan records second highest victory margin among Left candidates". The Hindu. Coimbatore. Retrieved 1 April 2021.
  4. Kaveri, Megha (22 March 2019). "'Will drive out 'godmen' from Western Ghats': CPI(M) Kovai candidate PR Natarajan". The News Minute. Coimbatore. Retrieved 1 April 2021.
  5. Andhrajyothy (14 December 2023). "14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.

బయటి లంకెలు

[మార్చు]