Jump to content

కంగాటి శ్రీదేవి

వికీపీడియా నుండి
(పి.జయరాం నుండి దారిమార్పు చెందింది)
కంగాటి శ్రీదేవి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – 2024
ముందు కేఈ కృష్ణమూర్తి
తరువాత కే.ఈ. శ్యామ్ కుమార్
నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 జూన్ 1972
బూరుగుల గ్రామం , ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
తల్లిదండ్రులు కమ్మగిరిరెడ్డి, వెంకటలక్ష్మి
జీవిత భాగస్వామి చెరుకులపాడు నారాయణరెడ్డి
సంతానం రామ్మోహన్‌రెడ్డి, స్నేహారెడ్డి

కంగాటి శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో పత్తికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కంగాటి శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా , ప్యాపిలి మండలం, బూరుగుల గ్రామంలో కమ్మగిరిరెడ్డి, వెంకటలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె బీఏ వరకు చదువుకుంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కంగాటి శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె భర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తుండగా 2017 మే 21వ తేదీన దారుణ హత్యకు గురయ్యాదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌లో జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఆమెను వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు.

కంగాటి శ్రీదేవి 2019లో పత్తికొండ నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్‌బాబు పై 42065 ​ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Pattikonda Constituency Winner List in AP Elections 2019 | Pattikonda Constituency MLA Election Results 2019". Archived from the original on 19 September 2021. Retrieved 19 September 2021.
  2. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. Sakshi (24 May 2019). "ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.