పీరారామచంద్రపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోర్లలమ్మ ఆలయం

పీరారామచంద్రపురం తూర్పు గోదానరి జిల్లా, అనపర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1]అనపర్తి నుండి అనపర్తి-రాజానగరం రోడ్డులో, అనపర్తికి 4 కి.మీ.దూరంలో ఉంది.ఇది గ్రామపంచాయితి. పీరారామచంద్రపురం తరువాత రాజానగరం మండల పరిథి మొదలవుతుంది. పిన్ కోడ్: 533 342.

గ్రామజనాభా

[మార్చు]
  • ప్రస్తుత జనాభా: 3500
  • పురుషుల సంఖ్య: 2000
  • మహిళలు: 1500

గ్రామంలో పింకిటిల్లు, డాబాలు ఉన్నాయి. గ్రామంలోజిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉంది. వూరిలోని రోడ్డులు సిమెంట్ రోడ్డులు.

వ్యవసాయ ఉత్పత్తులు

[మార్చు]
పీరరామచంద్రపురంలో పామాయిల్ తోట

వ్యవసాయం ప్రధానవృత్తి.వరి ప్రధాన పంట.ఆతరువాత మొక్కజొన్న పంట.ఈ రెండు ఏకవార్షిక పంటలు.ఇవికాక పామాయిల్‌, మామిడి, జీడిమామిడి తోటల సాగుకూడా ఉంది. ఈ గ్రామ పరిధిలో లెవీ బియ్యం సేకరించి, నిలువవుంచు ఎఫ్.సి.ఐ వారి గోదాం ఉంది.

పరిశ్రమలు

[మార్చు]

ఈ గ్రామ పరిధిలో తవుడునుండి నూనెతీయు పరిశ్రమ (సాల్వెంట్‌ప్లాంట్) ఉంది.రోజుకు 300 టన్నుల తవుడు నుండి నూనె తీయు సామర్థ్యం కలిగి ఉంది.అంతియే కాక కోళ్ళఫారాలు, రైసు మిల్లులు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.

వెలుపలి లంకెలు

[మార్చు]

]