పీష్వా
పీష్వా అంటే ప్రధాన మంత్రి. ఇది శివాజీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన పదవి. మహారాష్ట్రులకు భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత శివాజీ మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా రాజుకు కుడి భుజంలా పనిచేస్తూ పరిపాలనా విధులలో పాలుపంచుకొనేవాడు.
శివాజీ మనవడైన షాహు పరిపాలనా కాలంలో పీష్వా పదవికి ప్రాముఖ్యం పెరిగింది. ఛత్రపతి లేదా చక్రవర్తి అధికారం కేవలం నామమాత్రమైంది. వాస్తవ పరిపాలనా బాధ్యతలను పీష్వా చేపట్టాడు. వాస్తవ పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇతడి పరిపాలనా కాలం నుంచి పీష్వా పదవి శక్తివంతం, అనువంశికం అయింది. బాలాజీ విశ్వనాథ్ తర్వాత పీష్వా అయిన బాజీరావు-1 కాలంలో మరాఠా సర్దార్ల కూటమి ఏర్పడింది. వీరంతా చక్రవర్తి వ్విధేయులుగా పనిచేస్తూ మహారాష్ట్ర సమైక్యత కోసం కృషి చేశారు. శివాజీ, శంభాజీ, రాజారాం మొదలైన వారి దగ్గర పనిచేసిన వారంతా దేశస్థ బ్రాహ్మణులే.[1]
పదం వాడుక
[మార్చు]పేష్వా అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం ముందుండి నడిపించేవాడు, నాయకుడు అని.[2] 1674 లో శివాజీ పట్టాభిషేకం జరిగాక మోరోపంత్ త్రింబక్ పింగళేను మొదటి పీష్వాగా నియమించాడు.[3] శివాజీ ఈ పదవిని పంత్ ప్రధాన్ అని మార్చినా అది పెద్దగా వాడుకలోకి రాలేదు. మోరోపంత్ త్రింబక్ పింగళే కొడుకు మోరేశ్వర్ పింగళే శివాజీ తర్వాత శంభాజీ పరిపాలనా కాలంలో పీష్వాగా నియమితుడయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Vasant S. Kadam (1993). Maratha Confederacy: A Study in Its Origin and Development. Munshiram Manoharlal Publishers. p. 49. ISBN 9788121505703.
Under Shivaji the Great, Sambhaji and Rajaram all the incumbents of the office of Peshwa were from the Deshastha (residing in the Desh area of Maharashtra) subcaste of the Brahmans.
- ↑ under Jahangir, M. Learning focus. Longman History & Civics ICSE 7, 84.
- ↑ Kulkarni 1996, p. 47.
- ↑ Joshi 1980, p. 112.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Kulkarni, A.R (1996). Marathas and the Marathas Country: The Marathas. Books & Books. ISBN 9788185016504.
- Joshi, Pandit Shankar (1980). Chhatrapati Sambhaji, 1657-1689 A.D. s.chand.