పీసా టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీసా టవర్

పీసా టవర్ ఇటలీలో గల ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడం. సుమారు 183 అడుగులు ఎత్తున్న ఈ టవర్ ఓ పక్కకి 4 డిగ్రీలు ఒరిగి ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. ఇది పీసా కెథడ్రల్ క్రైస్తవ ప్రార్థనాలయానికి వెనుక ఉంటుంది. పీసా నగరంలోని ఆలయ చతురస్రంలో అత్యంత పురాతనమైన నిర్మాణాల్లో మూడవది. ఈ గోపురం ఒరగడం 12 వ శతాబ్దంలో దీన్ని నిర్మించేటపుడే మొదలైంది. దీనికి కారణం నిర్మాణానికి ఒక వైపు నేల మెత్తగా ఉండటంతో పునాది బలంగా లేకపోవడమే. దశాబ్దాలు గడిచేకొద్దీ నిర్మాణం పూర్తయ్యేలోపు క్రమంగా ఈ ఒరగడం మరి కాస్త ఎక్కవయ్యింది. 14 వ శతాబ్దిలో నిర్మాణం పూర్తయిన తరువాత కూడా కొంచె ఒరిగి, 1990 నాటికి దీని వాలు 5.5 డిగ్రీలకు చేరింది.[1][2][3] 20 వ శతాబ్దం చివర్లో, 21 వ శతాబ్దం మొదట్లో దీని వాలును కాస్త సరిచేశాక 3.97 డిగ్రీల వద్ద నిలిచింది.

ఈ టవరు ఎత్తు తక్కువ ఎత్తున్నవైపు 55.86 మీటర్లు, ఎక్కువ ఎత్తున్న వైపు 56.67 మీటర్లూ ఉంటుంది. బరువు 14,500 టన్నులు ఉంటుంది. [4]

నిర్మాణం[మార్చు]

దీని నిర్మాణ రూపశిల్పి ఎవరన్నది వివాదాస్పదంగా ఉంది. గుగ్లియెల్మో, బొన్నానో పిసానోలు దీని రూపశిల్పులని చాన్నాళ్ళ పాటు భావించారు.[5] 2001 లో చేసిన ఒక అధ్యయనంలో డియోటిసాల్వి దీని రూపశిల్పి అని తేలింది.[6]

దీని నిర్మాణం 199 ఏళ్ళ పాటు మూడు దశల్లో సాగింది. 1173 అగస్టు 9 న టవరు నిర్మాణానికి పునాది రాయి వేసారు.[7] 1178 లో రెండవ అంతస్తు నిర్మాణంలో ఉండగా ఇది కుంగడం మొదలైంది. బలహీనమైన నేలలో కేవలం మూడే మీటర్ల పుంబాది వెయ్యడం వలన ఇది కుంగడం మొదలైంది. దీంతో దీని నిర్మాణం ఒక శతాబ్ది పాటు ఆగిపోయింది. ఈ సమయంలో కింద ఉన్న నేల గట్టిపడింది. లేదంటే ఈ టవరు కూలిపోయి ఉండేది.[8] 1233 డిసెంబరు 27 న బెనెంటో అనే కార్మికుడు, నిర్మాణ పనిని పర్యవేక్షించాడు.[9] 1260 ఫిబ్రవరి 23 న గియొవాన్ని పిసానో నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు నియమితుడయ్యాడు.[10] On 12 April 1264, the master builder Giovanni di Simone, architect of the Camposanto, and 23 workers went to the mountains close to Pisa to cut marble. The cut stones were given to Rainaldo Speziale, worker of St. Francesco.[11] 1272 లో డిసిమియోన్ నేతృత్వంలో నిర్మాణం కొనసాగింది. వాలుకు వ్యతిరేకంగా ఉండేందుకు పై అంతస్తులను ఒక వైపు పొట్టిగా, మరో వైపు పొడుగ్గా నిర్మించారు. దీంతో ఈ టవరు సర్పిలాకారంలో ఉంటుంది.[12] 1284 లో మళ్ళీ నిర్మాణం ఆగిపోయింది.[13][14]

1319 లో ఏడవ అంతస్తు పూర్తైంది.[15] 1372 లో గంటల పందిరిని నిర్మించారు. సంగీతంలోని ఏడు స్వరాలకు ఒక్కొక్కటి చొప్పున అందులో ఏడు గంటలున్నాయి. అన్నిటి కంటే పెద్ద గంటను 1655 లో పెట్టారు.[16]


మూలాలు[మార్చు]

 1. "Europe | Saving the Leaning Tower". BBC News. 15 December 2001. Retrieved 9 May 2009.
 2. "Tower of Pisa". Archidose.org. 17 June 2001. Archived from the original on 26 జూన్ 2009. Retrieved 20 జూన్ 2020.
 3. "Leaning Tower of Pisa (tower, Pisa, Italy) – Britannica Online Encyclopedia". Britannica.com. Retrieved 9 May 2009.
 4. "Leaning Tower of Pisa Facts". Leaning Tower of Pisa. Retrieved 5 October 2013.
 5. Controversy about the identity of the architect Archived 13 ఆగస్టు 2007 at the Wayback Machine
 6. Pierotti, Piero. (2001). Deotisalvi – L'architetto pisano del secolo d'oro. Pisa: Pacini Editore
 7. Potts, David M.; Zdravkovic, Lidija; Zdravković, Lidija (2001). Finite Element Analysis in Geotechnical Engineering: Application (in ఇంగ్లీష్). Thomas Telford. p. 254. ISBN 9780727727831.
 8. "Fall of the Leaning Tower - History of Interventions". NOVA Online (PBS). 1999. Retrieved 24 April 2019.
 9. Public Record Offices of Pisa, Opera della Primaziale, 27 December 1234
 10. Public Record Offices of Pisa, Opera della Primaziale, 23 February 1260
 11. Public Record Offices of Pisa, Roncioni, 12 April 1265.
 12. McLain, Bill (1999). Do Fish Drink Water?. New York: William Morrow and Company, Inc. pp. 291–292. ISBN 0-688-16512-5.
 13. Potts, David M.; Zdravkovic, Lidija; Zdravković, Lidija (2001). Finite Element Analysis in Geotechnical Engineering: Application (in ఇంగ్లీష్). Thomas Telford. p. 254. ISBN 9780727727831.
 14. Touring club italiano (2005). Authentic Tuscany (in ఇంగ్లీష్). Touring Editore. p. 64. ISBN 9788836532971.
 15. Roth, Leland M. (2018-03-13). Understanding Architecture: Its Elements, History, and Meaning (in ఇంగ్లీష్). Routledge. p. 98. ISBN 9780429975219.
 16. "Fall of the Leaning Tower - History of Interventions". NOVA Online (PBS). 1999. Retrieved 24 April 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=పీసా_టవర్&oldid=3850924" నుండి వెలికితీశారు