పుట్టపర్తి కనకమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుట్టపర్తి కనకమ్మ (జూలై 22, 1922 - 1983) ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఈమె భర్త.

ఈమె 1922, జూలై 22 తేదీన ప్రొద్దుటూరు లో జన్మించారు. ఈమె కాశీ పండితులుగా ప్రసిద్ధిగాంచిన కిడాంబి రాఘవాచార్యులు మనుమరాలు. చిన్ననాటి నుండే గ్రంథపఠనం యందు ఆసక్తి తో ఎన్నో కావ్యాలు పఠించింది. 14 సంవత్సరాల వయసులో ఈమెకు నారాయణాచార్యులతో వివాహం జరిగింది. సహధర్మచారిణిగా భర్త వద్ద విద్యనేర్చుకోవడానికి వచ్చిన శిష్యులను పిల్లలవలె ఆదరించేది.

ఈమె సాహిత్యం మీద మక్కువతో భర్తకు తెలియకుండా కవిత్వం రాస్తుండేవారు. వాటిని ఒక ట్రంకుపెట్టెలో భద్రంగా ఉంచేది. ఒకనాడు పుట్టపర్తి వారు ఆ కవితల్ని చూసి ఆమె భావ పరిపక్వతకు, భాషా సౌందర్యానికి మురిసిపోయారు. ఆమె వద్దంటున్నా వాటిని వివిధ పత్రికలకు పంపారు. అవి ప్రచురించబడి లోకానికి ఆమె కవయిత్రిగా తెలిసింది. యశోధర, పశ్చాత్తాపం, విషాదగానం వంటి కవితా ఖండికలను కలిపి అగ్నివీణ పేరుతో పుట్టపర్తివారు వెలువరించారు.

రామాయణమామెకు ఇష్టమైన కావ్యం రాముడు ఆరాధ్య దైవం. వాల్మీకి రామాయణమును దాదాపు అయిదువందల పర్యాయాలు ఆమె పారాయణం చేసారు. వివిధ దైవాలపై చక్కని కృతులను భర్తతో కలిసి వ్రాసారు అవి అన్ని ఆకాశవాణి కేంద్రాలలోనూ ఎన్నో సంవత్సరాలు ప్రసారమయ్యాయి.

ఆమె సామాజిక స్పృతతో వరకట్నానికి వ్యతిరేకంగా కవితారచన చేశారు. ఈమె సంస్కృతంలో శ్రీరామ సుప్రభాతం రచించారు.

అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1974లో ఈమెను ఉత్తమ కవయిత్రిగా సన్మానించారు.

ఈమె 1983 సంవత్సరంలో పరమపదించారు.