పుట్టపాక చీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టపాక చీర
Puttapaka Saree.JPG
పుట్టపాక చీర
ప్రాంతంపుట్టపాక
నారాయణపూర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ
దేశంభారతదేశం


పుట్టపాక చీరలు అనేవి తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని పుట్టపాక గ్రామంలో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు.పట్టు వస్ర్తాల్లో మేటి డిజైన్లకు పేరుగాంచి, వన్నె తగ్గని మర మగ్గాలతో పుట్టపాక పట్టుకు ప్రాధాన్యతనిచ్చే పట్టుపుట్టగా మార్మోగుతోంది.[1]

నేత పరిశ్రమ[మార్చు]

పుట్టపాక చీరల డిజైన్ 200 పైగా సంవత్సరాల నాటిది. ఇతర చీరల వాటికంటే పుట్టపాక చీరలలో నిలువు పోగులు, అడ్డపోగులు ఇకత్ వార్ప్ కు సంబంధించినవే ఉంటాయి.ఇది దగ్గరగా సంబల్ పురి చీరను పోలివుంటుంది.

కుటీర పరిశ్రమ[మార్చు]

1980 సం.లో ఎక్కడెక్కడ్నుంచో పుట్టపాకకు సుమారు 400 చేనేత కుటుంబాలు వలస వచ్చాయి. ఈ పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని నష్టాలబాట పట్టడంతో దాదాపు సగం మంది తిరిగి వెళ్లిపోయారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ ప్రస్తుతం 500పైగా చేనేత మగ్గాలు నడుస్తున్నాయి.ఇందులో పుట్టపాక చేనేత కార్మికులు సభ్యులుగా ఉంటారు.పుట్టపాక చీరలు పోచంపల్లి చీరలుగా విక్రయించబడుతాయి. వీరు నేసిన చీర స్థానికంగా రూ.2000లకు అమ్ముడవుతుంది. చేనేతరంగం పరంగా ఈ గ్రామం నుంచి కృషి చేసిన వాళ్లెంతోమంది ఉన్నారు.

పురస్కారాలు[మార్చు]

నాలుగో అత్యున్నత పౌర పురస్కారం (పద్మశ్రీ అవార్డు)[మార్చు]

  1. గజం అంజయ్య చేనేత డిజైన్ కేటగిరీలో 2013 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.[2] గజం గోవర్ధన చేనేత డిజైన్ కేటగిరీలో 2011 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చేనేత రంగంలో చేసిన కృషికి ఫలితంగా పుట్టపాకకు చెందిన ఈ ఇద్దరికి భారత ప్రభుత్వ అత్యుత్తమ అవార్డు పద్మశ్రీ లభించింది. పుట్టపాకకే ప్రత్యేకమైన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగులతో 108 డిజైన్లతో రూపొందించిన వస్ర్తానికిగాను జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.

జాతీయ పురస్కారం[మార్చు]

  1. పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి, కొలను బుచ్చి రాములు (జాతీయ పురస్కారం, 2016, ఆగస్టు 7న జాతీయ చేనేత దివస్, వారణాసిలో ప్రధాని మోదీ చేతుల) మీదుగా అందుకున్నారు. [1] [3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, జిందగి. "డబుల్ ఇక్కత్‌తో.. పుట్టపాకకు పురస్కారం!". Retrieved 30 December 2016. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "డబుల్ ఇక్కత్‌తో.. పుట్టపాకకు పురస్కారం!" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. నమస్తే తెలంగాణ, TELANGANA NEWS. "మోదీ మెచ్చిన వస్త్రం మనదే!". Retrieved 31 December 2016.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "పుట్టపాక చేనేతకు జాతీయ అవార్డు". Retrieved 30 December 2016.

వెలుపలి లంకెలు[మార్చు]