తేలియా రుమాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేలియా రుమాల్
వివరణసహజ రంగులు, ముడిపదార్థాలతో తయారీ
రకంవస్త్రం
ప్రాంతంపుట్టపాక, నారాయణపూర్ మండలం
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
దేశంభారతదేశం
నమోదైంది2022, మే 10
పదార్థంనూలు

తేలియా రుమాల్ అనేది సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేసే వస్త్రం.[1] తేలియా రుమాల్‌ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఇది వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. తేలియా చీరను తయారు చేయడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. సింగిల్ ఇక్కత్‌లా కాకుండా, పవర్ లూమ్‌లో డబుల్ ఇక్కత్ తో నేయడం వలన డిజైన్ కాపీ చేయడం కష్టం. 2020లో పుట్టపాక తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ లభించింది.[2][3]

పద వివరణ[మార్చు]

తేలియా అనే పదం టెల్ (నూనె) నుండి వచ్చింది. ఆముదం, నూనె మిశ్రమంతో శుద్ధి చేయబడిన నూలు రంగును నిలుపుకోవడంలో, శీతలీకరణ లక్షణాలను అందించడంలో సహాయపడుతుంది.

చరిత్ర[మార్చు]

టెలియా రుమాల్ అనేది ప్రత్యేకమైన టై, డై టెక్నిక్, ఇది నూలు తయారీ కోసం నూనెను ఉపయోగిస్తుంది. ఈ నూనే మృదుత్వాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది, జింజెల్లీ ఆయిల్ ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. 1930ల తర్వాత హస్తకళాకారులు సింహాలు, ఏనుగులు, పక్షులు, గడియారాలు, విమానాలు వంటి అలంకారిక అంశాలను డిజైన్లలో చేర్చారు. దీని తయారీకి మెరుగైన నేత నైపుణ్యాలు అవసరమవుతాయి. ప్రస్తుతం చీరలతోపాటు దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్స్, ఇతర మేడ్-టు-ఆర్డర్ పద్ధతిలో రూపొందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని చీరాల వద్ద ఈ పద్ధతిని ప్రారంభించిన నేత కార్మికులు,[4] తేలియా రుమల్స్ తయారు చేయడం వాస్తవంగా మానేశారు. అవసాన దశలో ఉన్న ఈ కళ ప్రక్రియలో నైపుణ్యం సంపాదించిన వారు, తమ స్వగ్రామమైన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామంలో ప్రవేశపెట్టారు.

ఈ ప్రక్రియను హైదరాబాద్ నిజాంలు పోషించడంతోపాటు, విస్తృతమైన విభాగాలను ఏర్పాటుచేశారు.[5] గజం గోవర్ధన్ అనే చేనేత కార్మికుడు 1975లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సేవా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు చీరాలను సందర్శించి, తేలియా రుమాల్‌ను తయారుచేయడం నేర్చుకొని, ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అప్పటికి అంతరించిపోతున్న తెలియా రుమాల్ కళను పునరుద్ధరించాడు. అతను తెలియా రుమల్ పునరుద్ధరణకు చేసిన కృషితో, సహజమైన కళ ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.[6][7]

ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధన్, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు.

జిఐ ట్యాగ్[మార్చు]

2015లో తేలియ రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్‌ కోసం 2015లో గజం గోవర్ధన్‌ దరఖాస్తు చేశాడు. దాన్ని పరిశీలించిన చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ కార్యాలయ బృందం తేలియా రుమాల్ (జిఐ) ట్యాగ్‌ లో నమోదు చేయబడిందని 2020 మే 10న తెలియజేశారు.[8]

ప్రక్రియ[మార్చు]

ఇది సహజ కూరగాయల రంగులను ఉపయోగించే ఇకత్ సంప్రదాయ కళ.[9][10]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తేలియా రుమాల్‌... కియా కమాల్‌". Sakshi. 2020-05-15. Archived from the original on 2020-06-10. Retrieved 2023-08-08.
  2. Sangam, Sowmya (June 7, 2020). "'Puttapaka Telia Rumal' gets Geographical Indication tag". Telangana Today. Archived from the original on 4 September 2020. Retrieved 2023-08-08.
  3. "'Telia Rumal' saris set for comeback". The Hindu. 1 November 2008. Retrieved 2023-08-08.
  4. Zachariah, Preeti (2016-08-26). "Telia Rumal: Is the tide turning?". mint (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  5. Thatipalli, Mallik (2020-06-22). "Once Hyderabad aristocracy's favoured weave, how 'Telia Rumal' gained new lease of life". Firstpost. Retrieved 2023-08-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "'Recognition to weavers'". The Hindu. January 26, 2011.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. Kandavel, Sangeetha (12 May 2020). "'GI tag for Jharkhand's Sohrai Khovar painting, Telangana's Telia Rumal '". The Hindu.{{cite news}}: CS1 maint: url-status (link)
  8. "'Puttapaka Telia Rumal' gets GI tag". The Hindu. 2020-05-13. ISSN 0971-751X. Archived from the original on 2020-05-23. Retrieved 2023-08-08.
  9. Prabhu, Vidya (19 April 2012). "Open Thread". Retrieved 2023-08-08.
  10. "Always wanting more?". The Hindu. 2006-01-03. Archived from the original on 2007-07-17.