Jump to content

ఆర్‌ఎల్‌వి-లెక్స్

వికీపీడియా నుండి
పునర్వినియోగ వాహక నౌక - ల్యాండింగ్ పరీక్ష
మిషన్ రకంపరీక్షా ఫ్లైటు
ఆపరేటర్ఇస్రో
మిషన్ వ్యవధి30 minutes
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌక రకంఅంతరిక్ష విమానం
తయారీదారుడుఇస్రో
కొలతలు6.5 మీ x 3.5 మీ
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2023 ఏఫ్రిల్ 2,
01:40 UTC [1]
లాంచ్ సైట్చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజి
మిషన్ ముగింపు
ల్యాండింగ్ తేదీ2023 ఏప్రిల్ 2,
02:10 UTC
ల్యాండింగ్ ప్రదేశంచిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజి
RLV Technology Demonstration Programme
 

రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ (RLV - LEX) అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వారి RLV టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా చేసినరెండవ పరీక్షా ఫ్లైట్. ఈ ప్రదర్శన పరీక్షలు రెండు-దశలలో కక్ష్య లోకి (TSTO) వెళ్ళే పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం మార్గం సుగమం చేస్తాయి. LEX పరీక్షను 2023 ఏప్రిల్ 2 న జయప్రదంగా నిర్వహించారు. [2]

లక్ష్యాలు

[మార్చు]

LEX భారతదేశం అభివృద్ధి చేసిన పునర్వినియోగ ప్రయోగ వాహనపు రెండవ టెస్ట్ ఫ్లైట్. ఈ పరీక్షా ఫ్లైటు లక్ష్యాలు ఇవి: [1]

  • రీ-ఎంట్రీ వాహనం ల్యాండింగ్ అయ్యేటప్పటి పరిస్థితులను ఖచ్చితంగా అనుసరించడం - అదే తిరుగు మార్గం నుండి అధిక వేగంతో, మానవరహితంగా, స్వయంప్రతిపత్తితో, ఖచ్చితమైన ల్యాండింగ్ జరిగే విధానాన్ని పరీక్షించడం
  • భూమితో సాపేక్షంగా వేగం, ల్యాండింగ్ గేర్‌లు లోపలికి మునిగిపోయే రేటు, రీ-ఎంట్రీ వాహనపు దేహం దాని రిటర్న్ పాత్‌లో అనుభవించే ఖచ్చితమైన పరిస్థితులు మొదలైన ల్యాండింగ్ పారామితులను ధృవీకరించడం

మిషన్ ప్రొఫైల్

[మార్చు]

2023 ఏప్రిల్ 2 న, ఇస్రో RLV-TD ల్యాండింగ్ ప్రయోగాన్ని (LEX) విజయవంతంగా నిర్వహించింది. హైపర్‌సోనిక్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్ (HEX) తర్వాత నిర్వహించిన రెండో పరీక్ష ఇది. పునర్వినియోగ లాంచర్ యొక్క 6.5 మీటర్ల పొడవు గల చిన్న నమూనాను భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. అవసరమైన ఎత్తును చేరుకున్నాక, ముందుగా నిర్ణయించిన పారామితులను చేరుకున్న తర్వాత, RLV ని స్వయంప్రతిపత్త స్థితిలో విడుదల చేసారు. RLV అప్పుడు స్వయంప్రతిపత్తితో అవసరమైన విన్యాసాలు చేసుకుంటూ, కిందకి జారుతూ, పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లోని రన్‌వేపై దిగింది. ఈ పరీక్ష కోసం, ISRO DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లు కలిసి పనిచేసాయి. సూడోలైట్ సిస్టమ్, కా-బ్యాండ్ రాడార్ ఆల్టిమీటర్, NavIC రిసీవర్, స్వదేశీ ల్యాండింగ్ గేర్, ఏరోఫాయిల్ తేనె-తుట్టె ఆకారంలో ఉండే రెక్కలు, బ్రేక్ పారాచూట్ సిస్టమ్ వంటి అనేక కొత్త అత్యాధునిక సాంకేతికతలను ఈ మిషన్‌లో ఉపయోగించారు. జయప్రదంగా ప్రదర్శించారు.

మిషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ISRO ఛైర్మన్ S. సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ, వివిధ పరిస్థితులలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ప్రస్తుతం ఇలాంటి మరిన్ని ల్యాండింగ్ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ల్యాండింగ్ ప్రయోగం తర్వాత మరిన్ని ఇతర ప్రయోగాలను నిర్వహించడానికి ప్రణాళిక చేసారు. వాటిలో రీ-ఆర్బిటాల్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్ (REX), స్క్రామ్‌జెట్ ప్రొపల్షన్ ప్రయోగం (SPEX) లు ఉన్నాయి. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ISRO successfully conducts the Reusable Launch Vehicle Autonomous Landing Mission (RLV LEX)". Indian Space Research Organisation. isro.gov.in. April 2, 2023. Retrieved April 2, 2023.
  2. ""ISRO Reusable Launch Vehicles Landing Experiment Successful"".
  3. "Isro reusable launch vehicle's landing experiment successful; RLV closer to orbital re-entry mission". The Times of India. 2023-04-02. ISSN 0971-8257. Retrieved 2023-04-02.