పురుష వేశ్య
వేశ్యలుగా జీవించే పురుషులను పురుష వేశ్యలు అని పిలుస్తారు. స్త్రీలతో పోలిస్తే వీరిని గురించి ఎక్కువగా పరిశోధన జరగలేదు. కొంత మంది పురుషులు ధనార్జన కోసం లేదా ఇతర కారణాల వలన వేశ్యలుగా జీవిస్తారు[1]. ఇది బాగా అభివృద్ధిచెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ధనికులైన వివాహిత స్త్రీలు భర్త వలన లేదా ఇతరత్రా సంభోగంలో తృప్తి పొందలేనప్పుడు ఈ విధంగా ధనాశ గల పురుషుల్ని ప్రేరేపించి వారితో రతి జరుపుతారట. ప్రేమికులైన అవివాహితులకు సామాన్యంగా ఈ విధంగా పేర్కొనరు. కొంతమంది పురుషులు దీనిని పూర్తి సమయం వృత్తిగా చేసుకుంటే, మరికొంతమంది వేరుగా చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూనే అధిక ఆదాయం కోసం ఈ విధంగా స్త్రీలకు ఆనందాన్నిస్తారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కం అలవాటైన పురుషులు కూడా వీరిని అద్దెకు తెచ్చుకునే అవకాశం ఉన్నా కొందరు దీనికి ఇష్టపడరు.
పురుష వేశ్యలు ఎక్కువగా నైట్ క్లబ్బులలోను, స్పాలు, మసాజ్ సెంటర్లలో వీరి కార్యక్రమాల్ని జరుపుతున్నారు. అయితే కొన్ని స్టార్ హోటల్లలో కూడా గొప్పవారికి ఈ విధమైన సేవలను అందిస్తారని సమాచారం ఉన్నది.
ఇలాంటి జీవితాన్ని గడిపేవారికి స్త్రీలకు మాదిరిగానే ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా, పాపిల్లోమా వైరస్ వంటి లైంగిక అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు తప్పనిసరిగా తొడుగు (కాండమ్) ఉపయోగించడం సర్వదా శ్రేయష్కరం.
మూలాలు
[మార్చు]- ↑ Savage, Dan (30 May 2012). "The Gigolo Myth". East Bay Express. Retrieved 18 November 2015.