Jump to content

పులవర్తి కమలావతి

వికీపీడియా నుండి

పులవర్తి కమలావతి తెలుగు రచయిత్రి. ఆమె 1936 లో గృహలక్ష్మి స్వర్ణకంకణము పురస్కారం పొందింది.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 1927 ఏప్రిల్ 5న రాజమహేంద్రవరంలో సేవాసదన సప్తమ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభకు ఆమె అధ్యక్షత వహించింది. ఆ సందర్భములో ఆమెకు సమర్పించిన స్వాగత పద్యముల ఆధారంగా ఆమె తల్లిదండ్రులు సీతారత్నం, కామరాజాఖ్యుడు అని, ఆమె తల్లిది కంచర్ల వంశం అని తెలియుచున్నది.[3]

తే.గీ. అవని కంచర్ల వంశదు గ్ధాబ్ధినీదు
జననినిలయంబు జనని యుసాధుహృదయ
సీతారత్నంబసత్కీర్తి శేషుడైన
కామరాజాఖ్యుడెన్నంగ నిన్గన్న తండ్రి

ఆమె భర్త ఉద్యోగి అని వేరొక పద్యం వలన తెలియుచున్నది.

తే.గీ.మహతి ఉద్యోగి యయ్యెనీ మామగారు
భర్తయునునట్టిపదవినే పడసెభువిని
ఇట్టికులమున పాదంబు బెట్టితీవు
పసిడికిని తావియబ్బిన భంగిదోప

రచనలు

[మార్చు]
  1. కుముద్వతి
  2. విజయభాస్కర విజయము
  3. రాధికా చంద్రావళులు - 1927
  4. వీరభారత కథామంజరి
  5. విక్టోరియాక్రాసు
  6. క్రీస్తుచరిత్ర
  7. అబిసీనియావిధ్వంసము
  8. మీర్ జుంలా
  9. వేంగీరాజ్యపతనము
  10. తిలోత్తమ - పాపయ్యశర్మ[4] - 1937
  11. స్త్రీలకు నాటకరంగ ప్రవేశం[5]
  12. మణిమేఖల

మూలాలు

[మార్చు]
  1. మాలతి, రచయిత (2014-03-01). "గృహలక్ష్మి స్వర్ణకంకణము". తెలుగు తూలిక. Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-19.
  2. "::Press Academy of Andhra Pradesh". www.pressacademyarchives.ap.nic.in. Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-19.
  3. రాధికా చంద్రావళులు నవల, పులవర్తి కమలాదేవి, చివరి పుటలో ఆమె స్వాగత పద్యాలు
  4. పులవర్తి కమలావతిదేవి (1937). తిలోత్తమ - పాపయ్య శర్మ.
  5. "Changing Perceptions and Radicalisation of the National Movement in Andhra, 1922-34". dokumen.tips (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-19.