పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం
పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం | |
---|---|
Location | ఆంధ్రప్రదేశ్-తమిళనాడు, భారతదేశం |
Nearest city | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-తిరువల్లూరు |
Coordinates | 13°34′N 80°12′E / 13.567°N 80.200°E |
Governing body | ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, తమిళనాడు అటవీ శాఖ |
పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాల మధ్య 759 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం. భారతదేశంలోని ఉప్పు-నీటి సరస్సుల్లో ఒరిస్సాలోని చిలికా సరస్సు తరువాత పులికాట్ లేక్ రెండవ అతిపెద్ద సరస్సు.[1] దీని అంతర్జాతీయ పేరు పులికాట్ లేక్ వైల్డ్ లైఫ్ సంక్చురి, IBA కోడ్: IN261, ప్రమాణం: A1, A4iii.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 13°34′N 80°12′E / 13.567°N 80.200°E అక్షాంశరేఖాంశాల మధ్యలో ఉంది. ఇందులోని 327.33 చ.కి.మీ.ల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ,[3] 153.67 చ.కి.మీ.ల ప్రాంతం తమిళనాడు అటవీ శాఖ నిర్వహిస్తుంటుంది. 108 చ.కి.మీ.ల నేషనల్ పార్క్ ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు800–2000 మి.మీ. వర్షపాతం ఉండగా, 14°C నుండి 33C వరకు ఉష్ణోగ్రత మారుతుంటుంది. సగటు సముద్ర మట్టానికి 100' నుండి 1200' వరకు ఎత్తు ఉంటుంది.[1]
జంతుజాలం
[మార్చు]ఇక్కడ చాలా వృక్షజాలం ఉంది.[1][4] గూడ బాతు, కొంగలు వంటి జల, భూసంబంధమైన పక్షులకు ఆహారం, గూడు లభించే ప్రదేశం కనుక అనేక పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ సరస్సుకు ప్రతి ఏటా వందల వేల సందర్శకులు వస్తారు.
ప్రమాదాలు
[మార్చు]పులికాట్ సరస్సు నత్తలతో నిండిపోయి రాబోయే 100 సంవత్సరాలలో అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.[5] ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రభుత్వ, ప్రైవేటు ప్రభుత్వేతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Tamil Nadu Forest Department retrieved 9/9/2007 Pulicat Lake Bird Sanctuary Archived 4 జనవరి 2017 at the Wayback Machine
- ↑ BirdLife International Pulicat Lake Wildlife Sanctuary[permanent dead link]
- ↑ Andhra Pradesh Forest Department, PULICAT Wildlife Sanctuary Archived 25 జనవరి 2014 at the Wayback Machine
- ↑ Bird Forum, Pulicat Lake (Andhra Pradesh) (2008)
- ↑ Raj, P. J. Sanjeeva. Macro Fauna of Pulicat Lake Archived 27 జూలై 2011 at the Wayback Machine, National Biodiversity Authority Chennai, Tamil Nadu, India. (2006)