పులికాట్ రత్నవేలుచెట్టి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
"పులికాట్ రత్నవేలుచెట్టి
పులికాట్ రత్నవేలుచెట్టి తండ్రి రామస్వామిచెట్టి మద్రాసులో చాలా పెద్ద వ్యాపారి, మహా ధనవంతుడు, మద్రాసు మున్సిపాలిటీకి సంబంధించిన పనులు చేసేవాడట! ఈయన పెద్ద కుమారుడు రత్నవేలుచెట్టి 1856 లో జన్మించాడు, రత్నవేలుచెట్టి ICS చదివి, ఉన్నతాధికారి అయిన తర్వాత, అర్ధాంతరంగా అతని జీవితం ముగిసింది. రామస్వామిచెట్టి తన పెద్ద కుమారుడు రత్నవేలుచెట్టిని గొప్పవాణ్ణి చేయాలని మద్రాసులో బి.ఏ చదువు పూర్తి అయిన తర్వాత, ఉన్నత విద్యకోసం ఇంగ్లండ్ పంపించాడు. రత్నవేలు 1873 లో ఇంగ్లండ్ ప్రయాణమయ్యాడు. లండన్లో Balliol కాలేజీ (ఆక్స్ఫర్ )మ్యాథమేటికల్ scholarship కు ఎంపిక అయ్యాడు. అతనికి 1874 మే ఒకటవ తారీకున లండన్ లోని 'Lincoln’ Inn లో ప్రవేశం లభించింది. అప్పుడప్పుడే భారతీయులకు అక్కడి ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం ఇస్తున్నారు. రత్నవేలుచెట్టి Oxford లో ICS చదివి 1877 లో England బార్ కౌన్సిల్ లో రిజిస్టరు చేయించుకున్నాడు. పోతం జానకమ్మ, ఆమె భర్త రాఘవయ్య ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో ఇతను తమను కలుసుకున్నట్లు జానకమ్మ యాత్రచరిత్రలో రికార్డు చేసింది. బి.ఎ తర్వాత చదువు కొనసాగించకుండా స్వదేశానికి తిరిగివెళ్లిపోయి, 1877 లో సేలం జిల్లా కలెక్టరుకు Asst గా ఉద్యోగంలో చేరాడు. 1878 ఆగస్టు కల్లా చెంగల్పట్టు Asst కలెక్టర్ గా నియామకం అయింది. 1879 లో మలాబార్ యాక్టింగ్ హెడ్ Asst Collector గా పదోన్నతి పొందాడు. ఆదినాల్లో మ భారతీయులకు అంకన్నా పెద్ద ఉద్యోగాలు ఇవ్వరు.
ఇంత మేధావి, అద్భుతమైన తెలివితేటలూ కలిగిన రత్నవేలుచెట్టి జీవితం అంత విషాదాంతంగా ఎలా ముగిసింది? ఆతనిపేరు అర్ధాంతరంగా ఎందుకు కనుమరుగయింది? రికార్డులో ఎక్కడా అతని ప్రస్తావనలు లేకుండా చేయగలిగారు కానీ ఒక బ్రిటిష్ అధికారి తన స్వీయచరిత్రలో అతనికి జరిగిన ద్రోహాన్ని, అన్యాయాన్ని గ్రంథస్థం చేశాడు.
ఈ సంఘటనలు జరుగుతున్న సమయంలో పాల్ఘాట్లో జైలరుగా చేసిన Tyrrell అనే బ్రిటిష్ ఉద్యోగి తన ఆత్మచరిత్ర From England to Antipodes, 1846 to 1902 లో స్థానిక ఇంగ్షీషు అధికారులు రత్నవేలుచెట్టికి చేసిన అన్యాయాన్ని సవివరంగా రికార్డు చేశాడు. చదవండి:
పాల్ఘాట్ లో బ్రిటిష్ పాలకవర్గం, ఇంగ్షీషు వారు రత్నవేలుచెట్టి రాకను కంటగించుకొన్నారు, రత్నవేలు అచ్చం ఇంగ్లీషు దొరల లాగా వేషం, భాష, నడవడి, ఆహార వ్యవహారాలు అలవాటు చేసుకొన్నాడు. అతను పాల్ఘాట్ Asst Magostrate పదవిలో ఉండడం ఇంగ్లీషువారు జీర్ణించుకోలేకపోయారు. అతణ్ణి గురించి వాళ్ళలో వాళ్ళు గుసగుసలు, పుకార్లు వ్యాపింపజేయడం, ముఖ్యంగా నలుగురయిదుగురు శ్వేతాజాతి మహిళలు ఈ కార్యక్రమమాన్ని తీవ్రంగా ఉద్యమ స్థాయిలో కొనసాగించారు. గ్రద్దలు కోడిపిల్లలను యెత్తుకొని పోయే చందంగా వాళ్ళ తిట్లు, విమర్శలు దారుణంగా ఉండేవి.
తమ స్త్రీలు కలవరపడి తిట్ల పర్వానికి పూనుకుంటే వాళ్ళ మొగుళ్ళ సంగతి చెప్పేదేముంది?
ఆ పరిస్థితుల్లోనే రత్నవేలుచెట్టి క్రీస్తుమతం పుచ్చుకొన్నాడు, దాన్ని కూడా అక్కడి తెల్లవాళ్ళు హర్షించలేకపోయారు. అతను డిపార్ట్మెంట్ వారు జరిపిన తమిళం. తెలుగు, మలయాళం, సంస్కృతం పరీక్షలు కుడా పాసయ్యాడు.
ఆతను స్థానిక చర్చి సమావేశాలకు హాజరయ్యేవాడు, చర్చి చాప్లిన్ చర్చికి రావడం మానుకొన్న తర్వాత చెట్టి స్వయంగా చర్చి సమావేశాలు, సర్విస్ కుడా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదంతా స్థానిక శ్వేత జాతీయులకు మింగుడు పడలేదు. అతను చర్చికి క్రమం తప్పకుండా హాజరయి యూరోపియన్లలో కూడా పాపులార్ అయ్యాడు. పైగా ఇంగ్షీషు వారు నివసించే ప్రాంతంలోనే తన నివాసం ఏర్పాటు చేసుకొని, ఇల్లు, ఇంట్లో అలంకారాలు అన్నీ ఇంగ్లీషువారి గృహాలలో వలె అమర్చుకొని పూర్తిగా శ్వేతజయతీయుల మాదిరి వ్యవహరించసాగాడు. ఇంగ్లండ్ సివిల్ సర్విస్ పాసయిన వారిలో గొప్ప వ్యవహర్తగా, సంస్కారిగా, ఉంటూ ఖరీదయిన జీవితం జీవించాడు.
పాల్ఘాట్ కు రాకముందే అతను తీవ్రమైన వర్ణవివక్షను ఎదుర్కొన్నాడు. అతని సుగుణాలు, తెలివితేటలకు అసూయ పడిన తెల్లవాళ్ళు- ఆడామగా నిరంతరం అతని నలుపు రంగు, వేషాన్ని పరిహసించారు. అతని పైఅధికారి ఒక సమావేశంలో అతనితో కరచాలనం చేసి అందరిముందే నీళ్లతో చేతులు కడుక్కోడం ఎంత అవమానినికి, గురిచేసివుంటుందో ఎవరైనా ఊహించుకోగలరు. This incident may be the last straw. అటువంటి అసహాయ, దీన పరిస్థితిలో అతను 1881 September 25th పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
పాల్ఘాట్ ప్రజలు రత్నవేలుచెట్టి సంస్మరణార్థం పాల్ఘాట్ లో ఒక దీపస్తంభం నెలకొల్పి అందులో దీపాలు వెలిగించే ఏర్పాటు చేశారు. 24 సంవాత్సరాల వయసులోనే ఒక మేధావి, గొప్ప ఆధికారి కావలసిన వ్యక్తి జాతివివక్ష, వర్ణవివక్షలకు బలి అయి అర్ధాంతరంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.
మూలాలు:1.From England to the Antipodes and India, 1846 to 1902 with Startling Revelations or 56 Years of My Life in the Indian Mutiny, Police & Jails. by I.Tyrrell, printed aat A.L.V.Press, Madras, 1904. 2"The Tragic Story of Pulicit Ratnavelu Chetty -ICS, Palghat 1879-1881, Posted by Maddy lables:British Calicut, British Club, Palghat, ratna Velu Chrtty. The first Coveted I C S of the Madras Presidency.".Historic Alleys, Malabars' History.