పుల్లడి గుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుల్లడి గుంట
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మోద్రోత్ శివమ్మ
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్

పుల్లడి గుంట, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోద్రోత్ శివమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ ఉప్పుటూరి చినరాములు ఎన్నికైనారు. [3] & [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో, గ్రామస్తుల విరాళాలతో స్థానిక చెరువుకట్టపై రు. 15 లక్షల అంచనాతో ఈ ఆలయం నిర్మించారు. గ్రామంలో "కొర్నెపాడుతోపు" పేరుతో ఒక కాలనీ ఉంది. ఈ కాలనీకి వెళ్ళేదారి ప్రక్కన ఈ ఆలయం రూపుదిద్దుకున్నది. గర్భగుడిలో ప్రత్యేకంగా ఇనుముతో ఏర్పాటుచేసిన గ్రిల్సును ఏర్పాటుచేశారు. దీనివలన దేవాలయంలో పటిష్ఠమైన భద్రత ఉంటుంది. స్వామివారి శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014, మార్చి-10, సోమవారం నుండి 12వ తేదీ బుధవారం వరకు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యంత్రస్థాపన, రత్నన్యాసం, పుణ్యాహం, స్వామివారి పీఠారోహణం, విమాన శిఖర ప్రతిష్ఠ, జీవకలాన్యాసం, పూర్ణాహుతి కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగినవి. వివిధ గ్రామాలనుండి వచ్చిన భక్తులు, నవకోటి ధాన్యాలు వేస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]&[2]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామమునుండి జడ్.పి.టి, సి.గా ఎన్నికైన శ్రీమతి ఉప్పుటూరి సీతామహాలక్ష్మికి, జిల్లా పరిషత్తులో కీలకమైన జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఛైర్ పర్సనుగా పదవి లభించింది. వీరు, మండలంలోని వివిధ గ్రామాలలో, "ఉప్పుటూరి చినరాములు సేవా ఫౌండేషన్" ద్వారా పేద విద్యార్థులకు ఉపకారావేతనాలు, వృద్ధులకు బియ్యం, ఉప్పు, పప్పులు అందించుచున్నారు. మహిళలకు ముగ్గులపోటీలు, ఆటల పోటీలు, చిత్రలేఖనం వంటి పోటీలు ఏర్పాటుచేసి, బహుమతులు అందజేయుచున్నారు. [4]

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీ ఉప్పుటూరి రామకోటేశ్వరరావు (రాం చౌదరి)[మార్చు]

ఈ గ్రామములోని ఒక పేద కుటుంబలో జన్మించిన వీరు, అమెరికాలో వ్యాపారరంగంలో స్థిరపడినారు. అయినా వీరు తన స్వగ్రామంపై మమకారంతో, 2014లో ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయడానికై దత్తత తీసుకొని, లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుచుచున్నారు. తన తండ్రి పేరుమీద "చినరాములు సేవా ఫౌండేషను" స్థాపించి, దానిద్వారా మండలంలో పలు గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి 20 లక్షల రూపాయలు వితరణ చేసారు. గ్రామంలో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. గ్రామంలోని 35 నిరుపేద కుటుంబాలకు ప్రతి నెలా ఉప్పులు, పప్పులు, బియ్యం, చింతపండు వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 185 అంగనవాడీ కేంద్రాలకు బియ్యం నిలువ ఉంచుకొనడానికి పాత్రలు అందజేసినారు. ఆయన వితరణ చేసిన నిధులకు ప్రభుత్వం మరో 50 లక్షల రూపాయలు తనవంతు వాటా క్రింద విడుదల చేయగా, ఆనిధులతో గ్రామంలో సిమెంటు రహారులు ఏర్పరచారు. మరియొక 10 లక్షల రూపాయలతో, గ్రామంలో కాలువల నిర్మాణం చేపట్టినారు. ఇళ్ళలో చెత్తసేకరణకు ఇంటింటికీ ఒక చెత్తడబ్బను అందించడమేగాక, ఆ చెత్తను గ్రామం వెలుపలకు తరలించడానికి ఒక వాహనం, దానికి ఒక చోదకుడిని గూడా ఏర్పాటుచేసారు. [6]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.