Jump to content

పుల్లరి

వికీపీడియా నుండి

పుల్లరి అనగా పచ్చికమైదానములపై విధించే పన్ను, దీనిని పశువులు మేపడానికి వచ్చేవారిపై విధించేవారు. చరిత్రలో ఈ పన్ను కొంత ప్రాముఖ్యమును కలిగి ఉన్నది, విజయనగర రాజ్యంలో ఈ పన్ను విధించేవారు, అలాగే కాటమరాజు కథలో గొడవలు, యుద్ధాలుకు కారణం కూడా ఈ పన్నే!

పుల్లరి సత్యాగ్రహం

[మార్చు]
పుల్లరికి వ్యతిరేకంగా పోరాడిన కన్నెగంటి హనుమంతు

ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా... దానికి శిస్తు కట్టాల్సిందే. ఆ శిస్తుకే పుల్లరి అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఎదిరించిన వ్యక్తి ఓ తెలుగువాడు కావడం విశేషం. ఆయనే కన్నెగంటి హనుమంతు.

ఇదే పుల్లరి కారణంగా బ్రిటిషు వారి కాలంలో పలనాట ఒక సత్యాగ్రహోద్యమం జరిగింది. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. కన్నెగంటి హనుమంతు బ్రిటీషు వారి నిరంకుశ పాలన వల్ల సామాన్యులు అనుభవిస్తున్న బాధలను చూసి రగిలిపోయి పోరుబాట పట్టాడు. వారి సుంకం చెల్లించేది లేదని.. తెగేసి చెప్పాడు. పలనాటి సీమలో తెల్లవారి ఆగడాలకు ఎదురు నిలిచాడు. ప్రజలందరితో కలసి పుల్లరి సత్యాగ్రహం చేశాడు.[1]

బ్రిటిషువారు రూదర్ ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. సామాన్యులను తీసుకెళ్లి జైళ్లలో పెట్టారు. పుల్లరి కడితేనే అరెస్టు చేసిన వారిని విడిచిపెడతామని బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది. అలాంటి సందర్భంలో సుంకం చెల్లించలేని వారందరి తరఫున తాను చెల్లిస్తానని ముందుకొచ్చాడు కన్నెగంటి హనుమంతు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న హనుమంతుపై దాడి చేసి అతనిని చంపారు. చివరికి కన్నెగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.

మూలాలు

[మార్చు]
  1. "బ్రిటీషర్ల పుల్లరిని ఎదిరించిన తెలుగోడు..!". Zee News Telugu. 2018-03-24. Retrieved 2020-08-27.
"https://te.wikipedia.org/w/index.php?title=పుల్లరి&oldid=3266579" నుండి వెలికితీశారు