పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్
దర్శకత్వంసాజిద్ ఖురేషి
కథబాలాజీ తరనితరన్
నిర్మాతమహ్మద్‌ సోహైల్‌ అన్సారీ
తారాగణంశ్రీ
సుప్రజ
రాహుల్
సతీష్
మస్త్ ఆలీ
ఛాయాగ్రహణంమార్టిన్ జో
కూర్పుమోహన్ – రామారావు
సంగీతంగుణ్వంత్‌ సేన్‌
నిర్మాణ
సంస్థ
బ్లాక్ బస్టర్ స్టూడియో
విడుదల తేదీ
2013 ఆగస్టు 9 (2013-08-09)
సినిమా నిడివి
109 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ 2013, ఆగస్టు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాజిద్ ఖురేషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ, సుప్రజ, రాహుల్, సతీష్, మస్త్ ఆలీ తదితరులు నటించగా, గుణవంత్ సేన్ సంగీతం అందించాడు.[1][2]

2012లో బాలాజీ తరనితరన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, గాయత్రి శంకర్ జంటగా నటించిన నడువుల కొంజం పక్కత కానోమ్ తమిళ హాస్యచిత్రంకి రీమేక్ చిత్రమిది.

గతం మరచిపోయిన ఒక యువకుడి పెళ్ళి జరిపేందుకు అతని స్నేహితులు ఎలాంటి పనులు చేశారన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

కథా సారాంశం[మార్చు]

విజయ్ (శ్రీ), శివ, సలీం, బాలాజీ నలుగురు స్నేహితులు. విజయ్, సంధ్య (సుప్రజ)ని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్ళికి ఒప్పుకుంటారు. పెళ్ళి ముందురోజు నలుగురు స్నేహితులు క్రికెట్ ఆడటానికి వెళ్ళగా, ఆ ఆటలో విజయ్ చిన్న మెదడు దగ్గర దెబ్బతగిలి, టెంపరరీ మెమొరీ లాస్ వస్తుంది. దాంతో విజయ్ గత సంవత్సరం రోజులుగా ఏం జరిగింది అనేది మర్చిపోతాడు. విజయ్ కి గతాన్ని గుర్తు చేయడంకోసం, అనుకున్న టైంకి విజయ్ పెళ్ళి జరిపించడానికి అతని స్నేహితులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, విజయ్ కి గతం గుర్తొచ్చి, సంధ్యతో పెళ్ళి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.[3]

నటవర్గం[మార్చు]

  • శ్రీ (విజయ్)
  • సుప్రజ (సంధ్య)
  • రాహుల్ (శివ)
  • మస్త్ ఆలీ (సలీం)
  • సతీష్ (బాలాజీ)

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: సాజిద్ ఖురేషి
  • నిర్మాత: మహ్మద్‌ సోహైల్‌ అన్సారీ
  • కథ: బాలాజీ తరనితరన్
  • సంగీతం: గుణ్వంత్‌ సేన్
  • ఛాయాగ్రహణం: మార్టిన్ జో
  • కూర్పు: మోహన్ – రామారావు
  • నిర్మాణ సంస్థ: బ్లాక్ బస్టర్ స్టూడియో

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి గుణ్వంత్‌ సేన్ సంగీతం అందించాడు.[4]

  • రా రా (దీపు)
  • బ్యాండ్ బాజా (ఇందు సోనాలి)
  • అయ్యో రామారే (గాన బాల)
  • సరదాగా (చిన్న పొన్ను)
  • రబ్బా (దీపు)

విడుదల ౼ స్పందన[మార్చు]

ఈ చిత్రం 2013, ఆగస్టు 9న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలను అందుకుంది.[5]

మూలాలు[మార్చు]

  1. Times of India, Movie Reviews (10 May 2016). "Pusthakam Lo Konni Pagelu Missing Movie Review {2.5/5}: Critic Review of Pusthakam Lo Konni Pagelu Missing by Times of India". Archived from the original on 17 May 2020. Retrieved 17 May 2020.
  2. తెలుగు ఫిల్మీబీట్, సినిమా రివ్యూ (9 August 2013). "మెమరీ లాస్ తో ... (పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ ప్రివ్యూ)". www.telugu.filmibeat.com. శ్రీకన్య. Retrieved 17 May 2020.[permanent dead link]
  3. 123తెలుగు.కం, సినిమా రివ్యూ (9 August 2013). "సమీక్ష : పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ – అంతగా మెప్పించని ప్రయత్నం." www.123telugu.com/. Archived from the original on 23 జూలై 2017. Retrieved 17 May 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-14. Retrieved 2020-05-17.
  5. "Archived copy". Archived from the original on 4 October 2013. Retrieved 17 May 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

ఇతర లంకెలు[మార్చు]