పూనూరు గౌతమ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 - ప్రస్తుతం
నియోజకవర్గం విజయవాడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు Hand INC.svg కాంగ్రెస్ పార్టీ

పూనూరు గౌతమ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

పి. గౌతమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3] గౌతమ్ రెడ్డి 2014లో విజయవాడ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర రావు చేతిలో ఓడిపోయాడు.

పి. గౌతమ్ రెడ్డి 2018లో రెండోసారి వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4] ఆయనకు 2019లో పార్టీ టికెట్ దక్కలేదు. పి. గౌతమ్ రెడ్డి 2021 జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితుడై, 2021 ఫిబ్రవరి 12న భాద్యతలు చేపట్టాడు.[5]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (12 January 2021). "ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా పునూరు గౌతమ్‌ రెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  2. Sakshi (6 February 2021). "ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  3. Sakshi (28 August 2014). "వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలలోజిల్లాకు పెద్దపీట". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  4. Sakshi (24 May 2018). "వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌతంరెడ్డి". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  5. Praja Sakti (6 February 2021). "ఎపిఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.