పూలపల్లి (పాలకొల్లు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూలపల్లి (పాలకొల్లు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 4,007
 - స్త్రీలు 4,124
 - గృహాల సంఖ్య 2,250
పిన్ కోడ్ 534260
ఎస్.టి.డి కోడ్

పూలపల్లి పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.[1].. పిన్ కోడ్: 534 260. పాలకొల్లుకు దాదాపు కలిపి ఉన్నట్టుండే ఈగ్రామం పాలకొల్లుకు ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. పాలకొల్లు చివర ఉండుట వలన చాలావరకు విద్యాలయలు పూలపల్లిలో ఉన్నాయి. ఏలీం విద్యానికేతన్, వశిష్ట జూనియర్ కళాశాల మొదలగునవి. పూర్వము పాలకొల్లులో గల క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయమునకు పూలపల్లి గ్రామం నుండి ప్రతి రోజూ పూలను తీసుకునివెళ్ళి స్వామివారికి పూజలు చేసేవారు. ఈ గ్రామం పూలకు ప్రసిద్ధి గనుక కాలక్రమేణ పూలపల్లిగా పిలవబడుచున్నది. ప్రస్తుతము ఈ గ్రామంలో పరిశ్రమలు, రైసుమిల్లులు చాలాఉన్నవి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఇది వరకు సి.వి.రాజు ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది.కానీ ఇప్పుడు దాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చేశారు.ఇంకా గౌతమీ విద్యా సంస్థల,ఏలీం విద్యానికేతన్,చాంబర్స్ విద్యా సంస్థలు..ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి ఆనుకుని 214 జాతీయ రహదారి ఉంది.రవాణా సౌకర్యానికి ఏ లోటూ లేదు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,131 - పురుషుల సంఖ్య 4,007 - స్త్రీల సంఖ్య 4,124 - గృహాల సంఖ్య 2,250

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-14 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]