పూషడపువారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూషడపువారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఏ.బి.ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన ముకిరి లక్ష్మీప్రసన్న అను విద్యార్ధిని, పదవ తరగతి వార్షిక పరీక్షలలో 9.7 జి.పి.ఏ సాధించడమేగాక, ఐ.ఐ.ఐ.టి లో 2017-18 సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించినది. ఈమె తండ్రి తాపీపనిచేయుచునూ, తల్లి కూలిపనికి వెళుతూనూ, జీవనోపాధి గడించుచున్నారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో తిరుమల తిరుపతి దేవస్తానం, ధర్మప్రచార పరిషత్తు, సమరసత సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా, 2017,ఆగష్టు-13వతేదీ ఆదివారంనాడు, ఈ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం మహిళలు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించినారు. భక్తులకు శ్రీవారి పసుపు, కుంకుమ, కంకణాలు, ప్రసాదాలు పంపిణీ చేసినారు. 14వతేదీ సోమవారంనాడు, గోపూజ, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించెదరు.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఇంకొల్లు రంగారావు [మార్చు]

నగరం మండలం ఇంకొల్లువారిపాలెం మండలానికి చెందిన ఇంకొల్లు రంగారావు, ఎం.ఎస్.సి., బి.ఇడి., చదివి ప్రస్తుతం చెరుకుపల్లి మండలం లోని పూషడపువారిపాలెం గ్రామంలో బాపూజీ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్.జి.టి.గా పనిచేయుచూ విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం బోధించుచున్నారు. వీరు చదువుకునే సమయంలోనే, ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులే మెరుగ్గా ఉన్నారని తలచి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై, గ్రామీణ ప్రాంతాలలోనే పనిచేయాలని నిశ్చయించుకున్నారు. అదే విధంగా పనిచేయుచూ పేదవిద్యార్థులకు గూడా సాయం చేస్తున్నారు. ఆయన సహాయం చేసిన 40 మంది విద్యార్థులు, నేడు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడినారు. ప్రస్తుతం ఆయన ప్రతి సంవత్సరం, 100 మంది విద్యార్థులకు సాయం చేస్తున్నారు. ఇదిగాక ఇంకా వీరు, తన తల్లిదండ్రుల పేరిట, గ్రామస్థులకు అవసరమైన భవనాలు నిర్మించేటందుకు అవసరమైన 40 సెంట్ల భూమిని వివిధ ప్రాంతాలలో, ప్రభుత్వానికి విరాళంగా అందజేసినారు. 2006లోనే వీరు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 2009 లో జిల్లా స్థాయిలోనూ, 2011 లో రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా వీరు 2014, సెప్టెంబరు-5 వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఢిల్లీలో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతులమీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

మూలాలు[మార్చు]