పూసపాటి పరమేశ్వరరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూసపాటి పరమేశ్వరరాజు ప్రముఖ చిత్రకారుడు.[1] ఆయన కలీగ్రఫీ (నగిషీ చిత్రకళ) లో సుప్రసిద్ధులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ లోని వాండ్రం నందు 1961 లో జన్మించారు. ఆయన తండ్రి ఆర్మీ అధికారి అయినందున అనేక నగరాలలో పూసపాటి పరమేశ్వర రాజు బాల్యం గడిచింది. ఆయన ఔరంగాబాదులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయాల నుండి బి.ఎఫ్.ఎ, ఎం.ఎఫ్ ఎ డిగ్రీలను పొందారు. చిత్రకళలో పూర్తి జీవితం ప్రారంభించకపూర్వం ఆయన అడ్వర్టైజింగ్ పరిశ్రమలో కొంతకాలం పనిచేసారు. ఆయన ప్రతిమా శాస్త్రం , ఆధ్యాత్మికత, ఉత్సవాల సంస్కృతిపై అధ్యయనం చేసాక ఆయన నగిషీరాత పదే పదే కనిపిస్తుంది. ఆయన బుద్దిజం, సిక్కిజం, జైనిజం, ఇస్లాం, కొరాస్ట్రియన్, క్రిస్టియన్ ల; యొక్క వివిధ గాథలను సజీవంగా చిత్రించుటకు తక్కువ రంగులలో వివిధ పాళీలు, కలాలతో జీవం పోసేటట్లు చిత్రిస్తారు.[1]

కళా శైలి[మార్చు]

ఐదు దళసరి స్ట్రోక్స్ తో ఆధారాన్ని, ఒక సన్నని వక్రరేఖతో కలసి ఒక పడవను గీసారు. ఈ పడవలో రాముడు, సీత, లక్ష్మణుడు గుహుని వద్ద నుండి సరయూనదిలో వెళుతుండేటట్లు చిత్రించారు. రాముడు, లక్ష్మణుడు చిత్రాలను బాణం పట్టుకొనేటట్లు కొంత కోణంలో ఉన్న స్ట్రోక్స్ తోనూ, వారిమధ్య సీత కూర్చున్నట్లు చూపించడానికి ఆమె తలపై చిన్న రొట్టె ఆకారాన్ని చిత్రించారు. ఈ నగిషీ రాతను 37 చిత్రాలలో గల "రామాయణం - ఆనాటి కథనం" అనే శిర్షికతో చిత్రించారు. రాజు చిత్రించిన చిత్రాలన్ని ఎరుపు రంగులో వుంటాయి, ఎందుకంటే అరుణ వర్ణం ఆధ్యాత్మికతకు సంకేతమని కాబట్టి. [2]

పురస్కారాలు[మార్చు]

  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర పురస్కారం,
  • హైదరాబాదు, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, బరోడాలలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరిగాయి.
  • ఐదవ అంతర్జాతీయ బిన్నెల్, బీజింగ్ లోనూ, జర్మనీ లోనూ ఆర్ట్ ప్రదర్శనలు జరిగాయి.
  • 2021 కాలిగ్రఫీ ఆర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Poosapati Parameshwar Raju biography
  2. "Visual narrative with a rhythm". No. hindu. SANGEETHA DEVI DUNDOO. The Hindu. 6 February 2014. Retrieved 13 September 2016.

ఇతర లింకులు[మార్చు]