పూసల వీర వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూసల వీర వెంకటేశ్వరరావు
పూసల వీర వెంకటేశ్వరరావు
జననం1941
మరణంఫిబ్రవరి 15 2015
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ, ఎల్.ఎల్.బి, పి.జి.డి.ఎల్
క్రియాశీల సంవత్సరాలు1960 నుండి 2015
ఉద్యోగంకార్మిక శాఖలో ఉద్యోగం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రముఖ సినిమా రచయిత, దర్శకుడు
పురస్కారాలుబళ్ళారి రాఘవ అవార్డు

పూసల వీర వెంకటేశ్వరరావు సినిమా రచయిత, దర్శకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1941 విజయదశమి రోజున అన్నపూర్ణమ్మ,రామయ్య దంపతులకు జన్మించారు. ఆయన బి.ఎ, ఎల్.ఎల్.బి, పి.జి.డి.ఎల్ విద్యార్హతలు పొందారు. ఆయన రాంగస్థల ప్రవేశాన్ని 1956కీ బాలనటునిగా ప్రారంభించారు.కార్మిక శాఖలో ప్రభుత్వోద్యోగం చేసారు. 1960 నుండి రంగస్థల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1968 నుండి సినీమా కథా రచన ప్రారంభించారు.[1]

రచయితగా

[మార్చు]

రచయితగా 64 కథలు రచించిన ఆయన ‘డాలర్ కి మరో వైపు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చదువుకునే రోజుల నుండి నాటకరంగంపై పూసలకు మంచి పట్టుంది. ఆయన రచించిన, నటించిన ‘మండువా లోగిలి' నాటకానికి లలిత కళానికేతన్ (రాజమండ్రి) పరిషత్తులో బళ్ళారి రాఘవ అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. నటుడు జయప్రకాష్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేసిన అలెగ్జాండర్ నాటకానికి పూసల దర్శకత్వం వహించారు. ఈ నాటకానికి పలువురి ప్రశంసలు లభించాయి.[2]

నాటకాలు

[మార్చు]
 1. మాతృశ్రీ
 2. బానిస
 3. వల
 4. మండువా లోగిలి
 5. త్రీ ఇన్ ఒన్
 6. బ్రహ్మా నీ రాత తారుమారు
 7. అలెగ్జాండర్

అవార్డులు

[మార్చు]
 • బళ్ళారి రాఘవ అవార్డు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పూసలకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అది విజయవంతమైనప్పటికీ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా ఫిబ్రవరి 15 2015 ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు.[3]

మూలాలు

[మార్చు]
 1. "Poosala Veera Venkateswara Rao". తెలుగు రచయితల రచయితల సంఘం. Archived from the original on 2015-01-07. Retrieved 2015-06-16.
 2. "రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు". సాక్షి. 15 February 2015. Archived from the original on 4 జూలై 2015. Retrieved 16 జూన్ 2015.
 3. "రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు". సాక్షి. 15 February 2015. Archived from the original on 4 జూలై 2015. Retrieved 16 జూన్ 2015.

ఇతర లింకులు

[మార్చు]