పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనబడే శాస్త్రబద్ధమయిన వ్యవసాయ పద్ధతిని 1998 లో రూపొందించారు. హరిత విప్లవం వల్ల భూమిలో విష పదార్ధాలు పెరుగుతాయని నిరూపించి, ఈ పద్ధతిని రైతులకు బోధిస్తున్నారు.
వ్యవసాయ పద్ధతి
[మార్చు]- ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు.
- దేశవాళీ విత్తనాలు.
- కాష్ఠ పదార్థంతో ఆచ్ఛాదన.
- అంతర పంటలు.
- జీవామృతం తయారి
- భీజామృతం తయారి
- ఘన జీవామృతం తయారి
ఈ వ్యవసాయంలో మన దేశీయ గోవులది ప్రధాన పాత్ర. దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి, కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు . జెర్శీ ఆవుకు, దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజులు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు, హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
క్రిమి సంహారకాలు
[మార్చు]- నీమాస్త్రం
- బ్రహ్మస్త్రం
- అగ్నాస్త్రం
చరిత్ర
[మార్చు]సుమారు 1970వ శకం నుండి రసాయన పురుగుల మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి. వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కాని వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్తా పురుగుల మందులకు - కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతున్నది. రైతులు తమ పొలం పనులకు ట్రాక్టరు లేక ఎద్దులు, బండి కొనాలన్నా బ్యాంకులనుండి అప్పులు తీసుకోవలసివస్తున్నది. ఆశించినమేరకు చేతికి పంట రాకపోవుటవలన, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మళ్ళకుండా చదువులు చెప్పించి ఉద్యోగాలవైపు, వ్యాపారాల వైపు మళ్ళేలా చేయడం జరుగుచున్నది.
పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, ఎన్నో మిత్ర పురుగులు, పక్షులు అంతరించిపోయాయి, భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి వెళ్ళి నిస్సారమైపోయింది. ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రీయ వ్యసాయంవైపు వెళ్ళేలా చేశాయి.
ప్రస్తుత స్థితి, భవిష్యత్తు
[మార్చు]'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, చదువు లేనివారు కూడా కోట్లు సంపాదిస్తున్నారు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని తెలుసుకొని ఇటీవల చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పట్టుదలతో సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నారు. నగరాలకు చేరువలో లేదా స్వగ్రామాల్లో భూములను కొని లేదా కవులకు (లీజుకు) తీసుకొని సేంద్రీయ కూరగాయల పంటలు పండిస్తూ నగరాల్లోకి ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.
వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని అలోచించే ఆడపిల్ల తల్లిదండ్రులు, పట్నంలో చిన్నా చితకా ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యవసాయం వద్దని వారించే అబ్బాయిల తల్లిదండ్రులు, తమ ఆలోచనలను మార్చుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మా అబ్బాయి రైతు, మా అబ్బాయి భూమి పుత్రిక అని ప్రతి తల్లితండ్రీ గర్వంగా చెప్పుకొనే సమయాలు మునుముందు రానున్నాయి.
ఈ వ్యవసాయంలోకి ఎలా మారాలి?
[మార్చు]పెట్టుబడి లేని వ్యవసాయం వెంటనే మొదలుపెట్టరాదు. 3, 4 సంవత్సరాలపాటూ రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ వుండాలి. భూమిలో రసాయన ఎరువులు, కలుపు మందుల అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. తొలుత మూడు, నాలుగు సంవత్సరాలు దిగుబడులు, ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చును. తర్వాత సంవత్సరములనుండి తీసుకున్న శ్రద్ధను బట్టి అధిక దిగుబడులు, అధిక లాభాలు వస్తాయి.
ప్రయోజనాలు
[మార్చు]- పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి.
- వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది.
- ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.
- పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు రసాయన పద్ధతిలో పండించే పంటలకంటే ఎక్కువ మద్దతు ధర లభిస్తుంది.
- రైతులు బ్యాంకుల నుండి అప్పులు చేయక్కర్లేదు.
- ప్రభుత్వము రుణమాఫీలు చేయక్కర్లేదు.