పెద్ద నల్ల కాల్వ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"పెద్ద నల్ల కాల్వ" ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 372., ఎస్.ట్.డి.కోడ్ = 08406.


పెద్ద నల్ల కాల్వ
గ్రామం
పెద్ద నల్ల కాల్వ is located in Andhra Pradesh
పెద్ద నల్ల కాల్వ
పెద్ద నల్ల కాల్వ
నిర్దేశాంకాలు: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E / 15.567; 79.117Coordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E / 15.567; 79.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకంభం మండలం
మండలంకంభం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523 372 Edit this at Wikidata

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బొట్టా ఆదిలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి దేవాలయo[మార్చు]

2014, ఏప్రిల్-8న, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారామస్వామివారి దేవాలయ 25 వ వార్షికోత్సవం సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. [3]

ఈ మందిర ప్రథమ వార్షికోత్సవం, 2017, ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించెచారు. ఈ సందర్భంగా ఉదయం ఆరుగంటల నుండి ప్రత్యేకపూజలు, మద్యాహ్నం రెండు గంటలకు భజన, సాయంత్రం నాలుగు గంటలనుండి ఇస్కాన్ ఆధ్వర్య, ంలో తులసి పూజ, గోపూజ ఆరుగంటలకు ప్రవచనాలు, కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేసారు. భక్తులకు ఉదయం నుండి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [7]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామం సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ విజయకుమార్ గారి స్వంత గ్రామం. వీరి తండ్రి శ్రీ దానం కలెక్టరుగా పనిచేసిన కాలంలో గ్రామాభివృద్ధికి కృషి చేయడంతో ఆదర్శగ్రామంగా ఎన్నికైనది. అప్పుడు ఇక్కడ అన్ని వసతులు ఉండేవి. ఆ తరువాత పరిస్థితి మారినది. ఇప్పుడు ప్రధాన, అంతర్గత రహదారులు, మంచినీటి గొట్టాలను పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

బొట్లా రంగాఝాన్సీ[మార్చు]

ఈ గ్రామానికి చెందిన బొట్లా రంగనాయకులు చౌదరి, గాలెమ్మ దంపతుల కుమార్తె రంగాఝాన్సీ, హైదరాబాదులోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుచున్నది. ఈమె 2017, జనవరి-16, 17 తేదీలలోని గచ్చీబౌలీలోని క్రీడా మైదానంలో నిర్వహించిన ఖేల్ ఇండియా రాష్ట్రస్థాయి 100 మీటర్ల స్ప్రింట్ క్రీడా పోటీలలో స్వర్ణపతకం సాధించి స్ప్రింట్ ఛాంపియనుగా నిలిచింది. ఈ ఘనత సాధించిన ఈ బాలిక, 2016, జనవరి-23న గుజరాతు రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు ఈమె 10 స్వర్ణ, 3 రజత, 2 కాంస్య పతకాలు సాధించింది. [5]

2017, జనవరి-28 నుండి 31 వరకు, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీలలో, 4 X 100 రిలే పరుగుపందెం పోటీలలో, ఈమె రజత పతకం సాధించింది. [6]

తాజాగా, ఉమెన్ డెవలప్‌మెంట్ సంస్థ, ఈమెను రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-8న విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఈమెకు ఈ పురస్కారాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా ఙాపిక, ప్రశంసాపత్రం అందజేసినారు. ఈమె ప్రస్తుతం హైదరాబాదులోని తెలంగాణా రాష్ట్ర క్రీడా పాఠశాలలో, 9వ తరగతి చదువుచున్నది. ఈమె ఇంత వరకు, జాతీయస్థాయిలో ఒక రజత పతకం, రాష్ట్రస్థాయిలో 10 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించింది. [8]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జూలై-26; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-9; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016, ఫిబ్రవరి-20; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, జనవరి-19; 6వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-19; 6వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-23; 4వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-9; 1వపేజీ.