పెన్నా మధుసూదన్
Prof. Madhusudan Penna ఆచార్య పెన్నా మధుసూదన్ | |
---|---|
జననం | పెన్నా మధుసూదన్ 27. 1966 ఏప్రిల్ నార్కట్ పల్లి, జిల్లా : నల్గొండ : తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ భారత దేశము |
వృత్తి | సంస్కృతశిక్షకుడు |
ఉద్యోగం | Kavikulaguru Kalidas Sanskrit University Ramte |
ప్రసిద్ధి | సంస్కృత శిక్షకుడు, ప్రస్తుతం మహారాష్ట్రలోని కవికులగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ |
మతం | హిందూ |
పిల్లలు | శ్రీవరేణ్య, హాసిక |
తండ్రి | పెన్నా నరసింహశర్మ |
తల్లి | పెన్నా భారతీదేవి |
ఆచార్య పెన్నా మధుసూదన్ (Prof. Madhusudan Penna) గారు కవికుల గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్, మహారాష్ట్ర) ఉపకులపతిగా పనిచేస్తున్నారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]పెన్నా మధుసూదన్ గారు పెన్నా నరసింహశర్మ భారతీదేవి దంపతులకు నార్కెట్‌పల్లి నల్గొండ జిల్లా 27. 1966 ఏప్రిల్ లో జన్మించాడు. ప్రస్తుతం కవికుల గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్, మహారాష్ట్ర) కులపతిగా పనిచేస్తున్నారు.
విద్యాబ్యాసం
[మార్చు]గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మధుసూదన్‍ది పురోహిత కుటుంబం. ప్రాథమిక విద్యార్థి దశలోనే అక్కెనపల్లి గ్రామానికి చెందిన పండితులు అక్కెనేపల్లి అయోధ్యా రామయ్యగారి వద్ద వేద విద్యను నేర్చుకున్నారు. ఆ తరువాత పదవ తరగతి మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో చదువుకోవాల్సి వచ్చింది. పెన్నా మధుసూదన్ సంస్కృత విద్యాధ్యయనం సికిందరాబాద్‍లోని బోయిన్‍పల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్దినీ సంస్కృత కళాశాలలో పి.డి.సి, బి. ఏ. న్యాయశాస్త్ర అధ్యయనంతో వేగం పుంజుకుంది. ఆ విద్యాకాలం వారి జీవితాన్ని స్వర్ణయుగంగా మార్చుకోవడానికి దారి చూపింది. బ్రహ్మశ్రీ మరిగంటి శ్రీ రంగాచార్య, బ్రహ్మశ్రీ కందాడై రామానుజాచార్య స్వామి వారిని ఆదర్శంగా తీసుకొని, ఆ గురువుల అద్భుత బోధనలతో సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేసారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖలో ఎం.ఏ, ఎం. ఫిల్ పూర్తి చేసి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం విశేషం. ఎం. ఫిల్ పరిశోధనలో భాగంగా అభినవగుప్తుల గీతాభాష్య గ్రంథాన్నివిస్తృతంగా అధ్యయనం చేశారు. ఎం.ఫిల్ పూర్తికాగానే సంస్కృత భాషా ప్రచారానికి పూనుకున్నారు. మహర్షి మహేశ్ యోగి గారి వేదిక్ యూనివర్సిటీ నెదర్లాండ్స్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే కొత్త మార్గంలో వెళ్ళడానికి కావలసిన అధ్యాత్మిక ఆలోచనలకు బీజం పడింది. భావాతీత ధ్యానం నేర్చుకొని యోగ మార్గంలోకి ప్రవేశించారు. తనదైన అధ్యాత్మిక ప్రపంచాన్ని రూపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానం దొరికిన శిక్షణాకాలంగా భావించారు. నిరంతరం తత్త్వచింతన చేసే ఒక స్వభావం సంతరించుకున్న మనిషిగా రూపుదిద్దుకున్నారు. నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి వచ్చిన తరువాత సంస్కృతంలో పి.హెచ్ డి చేయడానికి యోగశాస్త్రాన్ని ప్రధాన పరిశోధనాంశంగా తీసుకున్నారు. పతంజలి యోగసూత్రాలపై, వ్యాసభాష్యం, నారాయణ తీర్థుల యోగ వ్యాఖ్యానం ప్రధానంగా స్వీకరించి లోతైన పరిశీలనల చేసి వ్యాఖ్యా నించారు. 1996లో పి.హెచ్ డి పట్టాను అందుకున్నారు. సిఫెల్ నుండి జర్మన్ భాషలో డిప్లమాను కూడా సాధించారు. హైద్రాబాద్ అరోరా డిగ్రీ కాలేజ్‍లో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తూ సాయం కాలాల్లో రామకృష్ణ మఠంలో సంస్కృతాన్ని బోధించేవారు.[2]
రచనల జాబితా
[మార్చు]రెండు మహాకావ్యాలు
[మార్చు]- 1. కావ్యకంఠచరితం (వెయ్యి శ్లొకాలలో కావ్యకంఠ గణపతి ముని చరిత్ర వర్ణనం), కేరళ చిన్మయ సంస్థ ద్వారా 2012 లో ముద్రణ
- 2. ప్రజ్ఞాచాక్షుషం (850 శ్లోకాలలో విదర్భ సంత్ గులాబ్ రావుమహారాజ్ చరిత్ర వర్ణనం), న్యూ భారతీయబుక్ కార్పోరేశన్ ముద్రణ 2014
లఘుకావ్యాలు
[మార్చు]- 1. ముద్గలచరితం రూపకం (1997),
- 2. రాహులసాంకృత్యాయన చరితం కావ్యం (2001),
- 3. నరమేధం కావ్యం (2001),
- 4. ఆవేదనం కావ్యం (2003),
- 5. కావ్యకంఠో విజయతే రూపకం (2004),
- 6. కాకదూతం కావ్యం (2014),
- 7. తత్త్వసుషమా కావ్యం (2018),
- 8. దేవరాత వైభవం కావ్యం (2018),
లఘు రచనలు
[మార్చు]- 1. యోగసూత్రసారం (1996)
- 2. యోగసారం (2020)
- 3. మధురాద్వైతసిద్ధి (2020)
- 4. యోగమెటాఫిజిక్స్ (2012)
సంపాదనలు
[మార్చు]- 1. శాణ్డిల్యభక్తిసూత్రభాష్యం (2011), (భక్తిసంప్రదాయం)
- 2. అద్వైతసామ్రాజ్యం (2008), (వేదాంత దర్శనం)
- 3. ద్రవ్యసారసంగ్రహం (2008), (వైశేషిక దర్శనం)
- 4.సంస్కృతబాలసాహిత్యం (2007) 23 భాగాలు
- 5. అఖిలభారతప్రాచ్యవిద్యాపరిషద్ 110 పుస్తకాలు
- 6. శోధసంహిత విశ్వవిద్యాలయ శోధపత్రిక మొదటి సంపాదకుడు
అనువాదాలు
[మార్చు]తెలుగు లోకి
[మార్చు]- 1. స్కందపురాణం మొదటిభాగం [3]
- 2. తర్కభాష అనువాదం (న్యాయశాస్త్రం)
- 3. అధ్యాత్మరామాయణం
- 4. నిర్ణయసింధు మొదటిభాగం
- 5. వేమభూపాలచరితం మొదటిభాగం
- 6. భాగవతదర్శనం
- 7. అవ్యక్తోపనిషద్
- 8. బ్రహ్మసూత్రం
- 9. అర్థసంగ్రహం (మీమాంసా శాస్త్రం)
ఇంగ్లీష్ లోకి
[మార్చు]- 1. మనీషాపఞ్చకం సదాశివేంద్రసరస్వతీభాష్యం (వేదాంత దర్శనం)
- 2. బ్రహ్మతత్త్వప్రకాశికా సదాశివేంద్రసరస్వతివ్యాఖ్య (వేదాంత దర్శనం)
- 3. సుసంహతభారతం మ. మ. పుల్లెల రామచంద్రుడు కావ్యం ఇంగ్లీష్ అనువాదం
- 4. భూషణసారం (వ్యాకరణ గ్రంథం)
- 5. భారతీయదర్శనం (ఐదు దర్శనాల మూల సూత్రాలు ఇంగ్లీష్ లో)
- 6. మీమాంసా దర్శనం (జైమిని సూత్రం, శాబరభాష్యం, కుమారిలభట్టు శ్లోకవార్తికం, తంత్రవార్తికం, టుప్టీకా, సూత్రం ఇంగ్లీష్ లో)
మరాఠీ నుంచి సంస్కృతం లోకి
[మార్చు]- 1. లౌకికన్యాయకోశం
- 2. సంస్కృతజ్ఞానేశ్వరీ
- 3. తర్కసంగ్రహం
పురస్కారాలు , బిరుదులు
[మార్చు]- 1. సాహిత్య అకాడెమీ, డిల్లీ (సంస్కృత మహాకావ్యం 2019).[4]
- 2. గౌరవ డీ.లిట్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి (2020)
- 3. మహారాష్టశాసన కాలిదాస సంస్కృత సాధనా పురస్కారం, మహారాష్ట్ర (2021),
- 4. మధుభారతీ, మహారాష్ట్ర (2020),
- 5. ఓగేటిపురస్కారం, హైదరాబాద్ (2020),
- 6. శాస్త్రరత్నాకర, భద్రాచలం (2020),
- 7. శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య పురస్కారం, హైదరాబాద్ (2018),
- 8. సోమనాథ సంస్కృత పణ్డితపురస్కారం, గుజరాత్ (2018),
- 9. పండిత ఘటాటే పురస్కారం, నాగపూర్ (2016),
- 10. పండిత లాట్కర్ శాస్త్రి పురస్కారం ముంబాయి (2015),
- 11. పండిత సాతవళెకర్ పురస్కారం, పూణె (2015),
- 12. శ్రీమాన్ వంగీపురం రామానుజాచార్య పురస్కారం, హైదరాబాద్ (2012),
- 13. యువవిపశ్చిత్ బిరుదు, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి (2007),
- 14. సంస్కృత పండిత బిరుదు, విదర్భ సంస్కృత భారతీ (2006),
బాధ్యతలు
[మార్చు]- 1. అఖిలభారతప్రాచ్యవిద్యాపరిషద్, (2020నాగపూర్) ప్రాంతీయ కార్యదర్శి
- 2. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముంబాయి నోడల్ ఆఫీసర్ (2015)
- 3. నాగపూర్ సంస్కృతభారతీ అధ్యక్షుడు ఐదు సంవత్సరాలు
- 4. కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యత 2022 (జనవరిలో) [5]
- 5. కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం సంశోధన, ప్రచురణల నిర్దేశకుడు
విదేశ పర్యటన
[మార్చు]- 1. నెదర్ లాండ్ వైదిక విశ్వవిద్యాలయంలో బొధన
- 2. కెనడా బ్రిటిశ్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రపంచ సంస్కృతసభలో భారత దేశ శాసన ప్రతినిధిగా ప్రతినిధిత్వం
మూలాలు
[మార్చు]- ↑ "Prof. Madhusudan Penna Hon'ble Vice-Chancellor Kavikulaguru Kalidas Sanskrit University". Archived from the original on 2022-01-20. Retrieved 2022-02-18.
- ↑ సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం
- ↑ శ్రీస్కంద మహాపురాణము ఆంధ్రానువాద సహితము ప్రథమ భాగము అనువాదకులుపెన్నా మధుసూదన్
- ↑ సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం సాక్షి దినపత్రిక Feb 26, 2020
- ↑ కాళిదాస్ వర్సిటీ వీసీగా నల్లగొండ వాసి హైదరాబాద్, 11 జనవరి 2022 (ఆంధ్రజ్యోతి):
ఇతర లింకులు
[మార్చు]- పెన్నా మధుసూధన వారి పేస్ బుక్ పేజీ
- Flipkartలో పెన్నా మధుసూదన్ వారి పుస్తకాలు Archived 2022-02-18 at the Wayback Machine
- Amazonలో పెన్నా మధుసూదన్ వారి పుస్తకాలు
- Exotic indiaలో పెన్నా మధుసూదన్ వారి పుస్తకాలు
- YouTubeలో పెన్నా మధుసూధన వారి ప్రసంగాలు
- రాంటెక్ సంస్కృత వర్సిటీ వీసీగా పెన్నా మధుసూదన్
- సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం, సాక్షి దినపత్రిక Feb 26, 2020
- కాళిదాస్ వర్సిటీ వీసీగా నల్లగొండ వాసి : Jan 12 2022 ఆంధ్రజ్యోతి దినపత్రిక
- Researchgate లో పెన్నా మధుసూదన్ గారు ప్రచురించిన పరిశోధనా వ్యాసాలు
- సంస్కృత యూనివర్సిటీ వీసీగా తెలంగాణా పౌరుడు, వరంగల్ టైమ్స్, జనవరి 11, 2022
- శ్రీస్కంద మహాపురాణము ఆంధ్రానువాద సహితము ప్రథమ భాగము అనువాదకులుపెన్నా మధుసూదన్
- Prof. Madhusudan Penna Hon'ble Vice-Chancellor, Kavikulaguru Kalidas Sanskrit University Archived 2022-01-20 at the Wayback Machine