పేరాయపాలెం
పేరాయపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పేరాయపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°43′43.176″N 79°55′9.552″E / 15.72866000°N 79.91932000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయితీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీ యానం రామాంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు. ( ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-10; 2వపేజీ.)
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామంలో 2008లో రు. 1.3 కోట్ల నాబార్డ్ నిధులతో శ్రీ లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకం ఏర్పాటయినది. పేరాయపాలెం గ్రామానికి ఆనుకొని, నిత్యం నిండుకుండలా ప్రవహించే దోర్నపు వాగుపై ఈ పథకాన్ని ఏర్పాటు చేసారు. దీని ద్వారా 500 ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే, పేరాయపాలెంతో పాటు ధేనువకొండ గ్రామాల భూములు గూడా సస్యశ్యామలం అవుతాయి. దోర్నపు వాగు అంచున, పంపు హౌస్ నిర్మించి 70 హెచ్.పి. సామర్ధ్యంగల 3 విద్యుత్తు పంపు సెట్లను అమర్చారు. ఈ పథకం నుండి ఒక కిలోమీటరు దూరం పొడవున ప్రధాన కాలువ నిర్మించారు. దీనికి అనుసంధానంగా, వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా చేసెటందుకు అవసరమైన చిన్నకాలువలు ఏర్పాటు చేసారు. ఇది రెండేళ్ళపాటు రైతులకు అడపాదడపా ఉపయోగపడింది. తరువాత ఈ పథకం మూలన పడినది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం
[మార్చు]పేరాయపాలెం గ్రామంలో కొండపై వేంచేసియున్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [2]