పేర్ల శివారెడ్డి
స్వరూపం
పేర్ల శివారెడ్డి | |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1978 - 1983 | |||
నియోజకవర్గం | కమలాపురం నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1937 యర్రగుంట్ల, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2020 మే 8 | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
నివాసం | శాస్త్రి నగర్, ప్రొద్దుటూరు |
పేర్ల శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో కమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]పేర్ల శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి ఉటుకూరి రామిరెడ్డి పై 1720 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]పేర్ల శివారెడ్డి అనారోగ్యంతో అస్వస్థకు గురై ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2020 మే 8న మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ HMTV (8 May 2020). "వైఎస్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Andhra Jyothy (8 May 2020). "మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Eenadu (8 May 2020). "మాజీ ఎమ్మెల్యే శివా రెడ్డి కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.