పేలోడ్ కవచం
అంతరిక్ష వాహనం ద్వారా అంతరిక్ష నౌకను లాంచి చేసేటపుడు వాతావరణపు ఒరిపిడి కారణంగా ఎదురయ్యే వత్తిడి, ఉష్ణాల నుండి రక్షించేందుకు వాహనానికి ముందు ఉండే శంఖాకారపు కవచాన్ని పేలోడ్ కవచం అంటారు. దీన్ని పేలోడ్ ఫెయిరింగ్ అని కూడా అంటారు. వాహనం భూ వాతావరణాన్ని దాటి పైకి పోగానే ఈ కవచాన్ని విడదీసి వదిలేస్తారు. అప్పుడు పేలోడు అంతరిక్ష వాతావరణానికి గురౌతుంది.
సాధారణంగా పేలోడు కవచం శంఖ, స్థూపాలు కలిసిన ఆకారంలో ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కవచాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆల్చిప్పల్లాగా రెండు ముక్కలుగా విడిపోయి పడిపోయే రకపు కవచాన్ని క్లామ్‌షెల్ కవచం లేదా ఆల్చిప్ప కవచం అంటారు.కొన్ని రాకెట్లలో, ఈ కవచం పేలోడుతో పాటు, రాకెట్ ఎగువ దశను కూడా కప్పి ఉంటుంది. ఉదాహరణ: అట్లాస్ V, ప్రోటాన్ M [1]
సాధారణంగా పేలోడు కవచాలు విడిపోయాక వాతావరణంలో ప్రవేశించి కాలిపోతాయి. లేదా సముద్రాల్లో కూలి, నాశనమౌతాయి. చరిత్రలో మొదటిసారిగా 2017 మార్చి 30 న, స్పేస్‌ఎక్స్ విడిపోయి భూవాతావరణంలో ప్రవేశించిన కవచాన్ని విజయవంతంగా తిరిగి సేకరించిది.[2] 2019 జూన్ 25 న రెండవ సారి, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ ఎస్‌టిపి -2 ప్రయోగంలో కవచాన్ని పట్టుకోగలిగింది. [3]
పేలోడ్ కవచాల వల్ల మిషన్ వైఫల్యాలు
[మార్చు]కొన్ని సందర్భాల్లో, నిర్దేశిత దశలో కవచం విడిపోక పోవడం వలన యాత్ర విఫలమవడం జరిగింది.
మానవసహిత యాత్ర కోసం ఉపయోగించే ఆగ్మెంటెడ్ టార్గెట్ డాకింగ్ అడాప్టర్‌ను 1966 జూన్‌లో అట్లాస్ ఎస్‌ఎల్‌వి -3 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అయితే తరువాత జెమిని సిబ్బంది అంతరిక్షంలో దాన్ని చేరినప్పుడు, కవచం తెరుచుకోలేదని గమనించారు. దాంతో డాకింగు కుదరలేదు. విమానానికి ముందు తొలగించాల్సిన రెండు లాన్యార్డ్‌లు ఇప్పటికీ ఆ స్థానంలో ఉన్నాయి. ఈ వైఫల్యానికి కారణం ప్రయోగ సిబ్బంది లోపం అని నిర్ధారించారు.
1999 లో, ఎథీనాస్ II రాకెట్ యొక్క పేలోడ్ కవచం సరిగ్గా తెరుచుకోక పోవడంతో, ఐకోనోస్ -1 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది, ఉపగ్రహం కక్ష్యలోకి చేరకుండా అడ్డుపడింది.
2009 ఫిబ్రవరి 24, 2009 న, నాసా వారి కార్బన్ అబ్జర్వేటరీ, బహుశా కవచం విడిపోనందువలన, కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. దీని వలన వాహనం ద్రవ్యరాశిని ఎక్కువై, తరువాత భూమిపై పడిపోయింది. [4] [5] 2009 ఆగష్టు 25 న ప్రయోగించిన దక్షిణ కొరియా యొక్క మొట్టమొదటి క్యారియర్ రాకెట్ అయిన నారో -1 కు కూడా ఇదే జరిగింది. ప్రయోగ సమయంలో పేలోడ్ కవచపు సగభాగం వేరుపడలేదు. ఫలితంగా, రాకెట్ దాని పథం నుండి దూరంగా పోయింది. ఉపగ్రహం స్థిరమైన కక్ష్యకు చేరుకోలేదు. [6] 2011 మార్చి 4 న, నాసా యొక్క గ్లోరీ ఉపగ్రహ ప్రయోగం కూడా విఫలమైంది. [7]
2017 ఆగస్టు 31 న, ఇస్రో యొక్క పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ప్రయోగంలో పేలోడ్ కవచం వేరుపడక పోవడంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని మోహరించడంలో విఫలమైంది. దీంతో అన్నిదశల పనితీరు మామూలుగానే ఉన్నప్పటికీ, అదనపు ద్రవ్యరాశి ఫలితంగా రాకెట్ కావలసిన కక్ష్యకు చేరుకోలేదు. పేలోడ్ అంతర్గతంగా వేరుచేయబడి, ఉష్ణ కవచంలో చిక్కుకుంది. [8] [9]
తయారీదారులు
[మార్చు]- జూరిక్ లోని RUAG స్పేస్ సంస్థ ఏరియాన్ రాకెట్టు కవచాలను తయారు చేస్తుంది. [10] ఇది అట్లాస్ 5 కోసం 5 మీటర్ల కవచాలను కూడా తయారు చేస్తుంది.
- స్పేస్‌ఎక్స్ తన ఫాల్కన్ 9 ఫ్యామిలీ రాకెట్స్‌లో ఉపయోగించిన కవచాలను తయారు చేసుకుంటుంది. [11]
చిత్ర మాలిక
[మార్చు]-
నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ దాని పేలోడ్ ఫెయిరింగ్‌లో జతచేయబడింది
-
అట్లాస్ 5 దాని ఫెయిరింగ్‌లో నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ పేలోడ్‌ను కలిగి ఉంది, ఇది ప్రయోగానికి సిద్ధంగా ఉంది
-
ఫాల్కన్ 9 రెండవ దశ, ఎగువ ఎడమ వైపున పేలోడ్ ఫెయిరింగ్ యొక్క రెండు భాగాలు; దిగువ కుడి వైపున మొదటి దశ
-
ఎన్క్యాప్సులేషన్కు ముందు అట్లాస్ V ఫెయిరింగ్ లోపల బోయింగ్ X-37B
మూలాలు
[మార్చు]- ↑ A Conceptual Design for the Space Launch capability of the peacekeeper ICBM
- ↑ Lopatto, Elizabeth (31 March 2017). "SpaceX even landed the nose cone from its historic used Falcon 9 rocket launch". The Verge. Retrieved 31 March 2017.
- ↑ Ralph, Eric (2019-06-25). "SpaceX successfully catches first Falcon fairing ever in Mr. Steven's/Ms. Tree's net" (in అమెరికన్ ఇంగ్లీష్).
- ↑ Perez, Martin (5 March 2015). "Orbiting Carbon Observatory 2 (OCO-2)". Archived from the original on 18 జూలై 2019. Retrieved 9 సెప్టెంబరు 2019.
- ↑ "NASA Satellite Crashes Before Reaching Orbit"
- ↑ "S. Korean satellite lost shortly after launch: gov't". Yonhap News. Retrieved 2009-08-26.
- ↑ Buck, Joshua (February 19, 2013). "NASA Releases Glory Taurus XL Launch Failure Report Summary Archived 2019-05-02 at the Wayback Machine". NASA. Retrieved March 16, 2014.
- ↑ "Setback for ISRO: Launch of navigation satellite IRNSS-1H unsuccessful". The Economic Times. 2017-08-31. Retrieved 2017-08-31.
- ↑ "ISRO says IRNSS-1H launch unsuccessful, heat shields failed to separate". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-31. Retrieved 2017-08-31.
- ↑ "Atlas V Launch Services User's Guide" (PDF). United Launch Alliance. March 2010. Archived from the original (PDF) on 2012-06-08. Retrieved 2010-05-24.
- ↑ "Fairing". 2013-04-12. Archived from the original on 2019-06-04. Retrieved 2015-07-30.