Jump to content

పొటాషియం అయోడైడ్

వికీపీడియా నుండి
(పొటాషియం అయోడైడు నుండి దారిమార్పు చెందింది)
పొటాషియం అయోడైడ్
పేర్లు
IUPAC నామము
Potassium iodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7681-11-0]
పబ్ కెమ్ 4875
డ్రగ్ బ్యాంకు DB06715
కెగ్ D01016
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:8346
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య TT2975000
ATC code R05CA02,S01XA04, V03AB21
SMILES [K+].[I-]
ధర్మములు
KI
మోలార్ ద్రవ్యరాశి 166.0028 g/mol
స్వరూపం white crystalline solid
సాంద్రత 3.123 g/cm3
ద్రవీభవన స్థానం 681 °C (1,258 °F; 954 K)
బాష్పీభవన స్థానం 1,330 °C (2,430 °F; 1,600 K)
128 g/100 ml (0 °C)
140 g/100 mL (20 °C)
176 g/100 mL (60°C)
206 g/100 mL (100°C)
ద్రావణీయత 2 g/100 mL (ethanol)
soluble in acetone (1.31 g/100 mL)
slightly soluble in ether, ammonia
వక్రీభవన గుణకం (nD) 1.677
స్నిగ్ధత 1.0227 cP (733 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-327.6 kJ/mol
విశిష్టోష్ణ సామర్థ్యం, C 52.73 J/mol K
ప్రమాదాలు
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Lithium iodide
Sodium iodide
Rubidium iodide
Caesium iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

పొటాషియం అయోడైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళనం. ఈ సమ్మేళన పదార్థం యొక్క అణు రసాయన ఫార్ములా KI. సమ్మేళనం తెల్లగా ఉండు లవణం. వ్యాపారాత్మకంగా డిమాండు ఉన్న రసాయన సమ్మేళనం.

ధర్మాలు

[మార్చు]

ఈ సమ్మేళనం సోడియం అయోడైడ్ కన్న తక్కువ జలాకర్షణ (hygroscopic ) కలిగిన లవణం. పొటాషియం అయోడైడ్ యొక్క సాంద్రత:3.123గ్రాములు /ఒక లీటరు.మోలార్ భారం: 166.0028 గ్రాములు/మోల్. ద్రవీభవన స్థానం 681 °C, భాస్పిభవన ఉష్ణోగ్రత 1330C. నీరు, ఇథనాల్ (2.0 గ్రాము/100 మీ.లీ ), అసిటోన్ (1.31 గ్రాములు/100 మీ .లీ లో) కరుగుతుంది. నీటిలో పొటాషియం అయోడైడ్ ద్రావణియత నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది పెరుగుతుంది. 100 మీ.లీ నీటిలో 0°Cవద్ద 128 గ్రాములు, 20 °C వద్ద 140గ్రాముల, 60°Cవద్ద 176 గ్రాముల, 100°Cవద్ద 206 గ్రాముల పొటాషియం అయోడైడ్ కరుగుతుంది.

ఎక్కువ కాలం నిల్వ ఉన్న, మలినాలు కలిగిఉన్న ఈ సమ్మేళనం నెమ్మదిగా ఆక్సీకరణకులోనవ్వడం వలన (ఆక్సీకరణ వలన కొంత మేర పొటాషియం కార్బోనేట్, అయోడిన్ ఏర్పడును) పసుపు రంగు కలిగి ఉండును.

4 KI + 2 CO2 + O2 → 2 K2CO3 + 2 I2

ఉత్పత్తి గణాంకాలు

[మార్చు]

1985 లో 37 వేల టన్నుల పొటాషియం అయోడైడ్ ఉత్పత్తి చేశారు.

నిర్మాణం,ఉత్పత్తి,లక్షణాలు

[మార్చు]

వ్యాపారాత్మకముగా పొటాషియం అయోడైడ్ ను పొటాషియం హైడ్రాక్సైడ్ ను అయోడిన్ తో రసాయనిక చర్యకు లోను కావించడం ద్వారా ఉత్పత్తి చేయ్యుదురు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization') యొక్క గుర్తించిన, ఆమోదించిన ఆవశ్యక ఔషదాలలో పొటాషియం అయోడైడ్ ఒకటి.

అకర్బన రసాయన చర్యలు

[మార్చు]

అయోడిన్ యొక్క అయాన్ స్వల్పంగా క్షయికర కారక స్వభావమున్నందున, క్లోరిన్ వంటి శక్తి మంతమైన ఆక్సీకరణ కారకం నుపయోగించి I-ను I2 గా పరివర్తనం చెందించవచ్చును.

2 KI(aq) + Cl2(aq) → 2 KCl + I2(aq)

ఈ రసాయన ప్రతిచర్య ఆధారంగా సహజ వనరులనుండి అయోడిన్ ను సులభంగా వేరు చెయ్యవచ్చును.

తత్తిమా అయోడైడ్ లవణాల వలె పొటాషియం అయోడైడ్ సమ్మేళనం, మూలక అయోడైడ్ తో సంయోగం చెందటంవలన I3−ను ఏర్పరచును

KI(aq) + I2(s) → KI3(aq)

I3 లవణాలు, I2 లవణాలకన్న భిన్నంగా అధిక మొత్తంలో నీటిలో కరుగు ధర్మాన్ని కలిగియున్నవి.

పొటాషియం అయోడైడ్, సిల్వర్ నైట్రేట్ లను రసాయనిక చర్యకు లోనుగావించి సిల్వర్ (I) అయోడైడ్ ను ఉత్పత్తి చెయ్యుదురు. సిల్వర్ (I) అయోడైడ్ ను హైస్పీడ్ పొటోగ్రాఫిక్ ఫిల్మ్స్లలో ఉపయోగిస్తారు.

KI(aq) + AgNO3(aq) → AgI(s) + KNO3(aq)

కర్బన రసాయన చర్యలు

[మార్చు]

పొటాషియం అయోడైడ్ అనునది జీవపదార్థ నిర్మాణం, నిర్వహణలో అవసరమైన అయోడిన్ ను అందించు మూల వనరుగా పనిచేయును. అరెనె డైయాజోనియం లవణం నుండి అరైల్ అయోడైడ్ లను ఉత్పత్తి చెయ్యడంలో పొటాషియం అయోడైడ్ భాగస్వామ్యం ఉంది.

పొటాషియం అనునది అయోడినును అందించు మూల వనరుగా పనిచేస్తుంది. అల్కైల్ క్లోరైడు, బ్రోమైడ్, మేసిలేట్ లను అల్కి లెసన్ (alkylation) చెయ్యుటకు న్యూక్లియో ఫిలిక్ ఉత్పెరకంగా పనిచేయును.

వినియోగాలు

[మార్చు]

పోటోగ్రాఫిక్ తయారీలో రసాయనపు పూతగా ఉపయోగించు సిల్వర్ అయోడైడ్ (AgI) ను పొటాషియం అయోడైడ్, సిల్వర్ నైట్రేట్ లను సంయోగం చెందించుట వలన ఉత్పత్తి చెయ్యుదురు.[1] disinfectantsలలో, కేశ చికిత్స రాసాయనాలలో పొటాషియం అయోడైడ్ ను ఉపయోగిస్తారు. అలాగే బయోమెడికల్ పరిశోధనలలో ఫ్లోరోసేన్సు క్వేమ్చిమ్గ్ కారకంగా ఉపయోగిస్తారు. డై సేన్సిటైసిడ్ సోలార్ సెల్సు (DSSC) లలో అయోడిన్ తో పాటుగా పొటాషియం అయోడైడ్ ఉపయోగిస్తారు. ఆర్గానిక్ సింథసిస్ చర్యలో సాండ్ మేయర్ ప్రతిచర్య ద్వారా అరైల్ అయోడైడ్ లలో ఉత్పత్తిలో పొటాషియం అయిడైడ్ తనదైన పాత్ర పోషిస్తుంది. పొటాషియం అయోడైడ్ ను పశు, మానవ ఆహారములో పోషక supplement గా ఉపయోగిస్తారు.

ఔషదరంగం

పొటాషియం అయోడైడ్ను thyroid storm చిక్సితలో ఉపయోగిస్తారు. తక్కువ జీవిత ప్రమాణ మున్న అయోడిన్ -131 ఐసోటోపు సంలీనం వలన పరిసరప్రాంతాలు రేడి యేసన్ విషపూరితమైన సందర్భంలో కలుగు దుష్పరిమాణాలను నివారించటానికి అత్యవసర నివారణ కై 130 మి.గ్రాముల పొటాషియం అయోడైడ్ మాత్రలను (ఒకమాత్రలో 100 మి.గ్రాము ల అయోడిన్ అయోడైడ్ రూపంలో, 30 మిగ్రాములను పొటాషియం రూపంలో ) ఇచ్చెదరు

మూలాలు

[మార్చు]
  1. "Potassium Iodide". yourdictionary.com. Retrieved 2015-07-10.