Jump to content

పొన్నపురెడ్డి శివారెడ్డి

వికీపీడియా నుండి
పొన్నపురెడ్డి శివారెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1994
ముందు చవ్వా మోరమ్మగారి రామనాథ రెడ్డి
తరువాత పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి
నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1948
గుండ్లకుంట, పెద్దముడియం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మీదేవమ్మ
బంధువులు పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి (అన్న కుమారుడు)

పొన్నపురెడ్డి శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983 నుండి 1994 వరకు జమ్మలమడుగు నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పొన్నపురెడ్డి శివారెడ్డి (బాంబుల శివారెడ్డి) ఎమ్మెల్యే కాకముందు సమితి అధ్యక్షుడిగా,పెద్దముడియం మండలం గుండ్లకుంట సర్పంచిగా పని చేశాడు. ఆయన 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి చవ్వా మోరమ్మగారి రామనాథ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తాతిరెడ్డి నరసింహరెడ్డి పై 17894 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

పొన్నపురెడ్డి శివారెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1985లో కుండా పెద్దచౌడప్ప, 1989లో మైఖేల్‌ విజయ్‌కుమార్‌పై జమ్మలమడుగు నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మరణం

[మార్చు]

పొన్నపురెడ్డి శివారెడ్డి 7 ఆగష్టు 1993లో హైదరాబాద్ లో ఓ బాంబు దాడిలో హత్యకు గురై మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (7 February 2021). "ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు." Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
  2. India Today (31 August 1993). "Telugu Desam Party makes political capital out of MLA's murder" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.