పోక్సో చట్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం
Enacted byభారత పార్లమెంటు
Date enacted2012

పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది,[1][2][3] ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది. చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా నవంబరు 2012లో నోటిఫై చేయడంతో చట్టం అమలుకు సిద్ధమైంది.[4] మరింత కఠినమైన చట్టాల కోసం అనేక డిమాండ్లు ఇంకా ఉన్నాయి.[5][6]

ప్రపంచంలోనే అత్యధిక పిల్లల జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంఖ్య 472 మిలియన్లు కాగా ఇందులో 225 మిలియన్ల మంది బాలికలు ఉన్నారు.[7][8] భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని బాలల రక్షణ భారతీయ పౌరులకు హామీ ఇవ్వబడింది.[9][10]

పోక్సో చట్టం 2012 ముందు అమలులో ఉన్న చట్టాలు

[మార్చు]

పోక్సో చట్టం 2012 ముందు, గోవా చిల్డ్రన్ యాక్ట్ 2003 అనేది పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఏకైక చట్టం.[11] బాలలపై లైంగిక వేధింపుల నేరాలు భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ల కిందకు వచ్చేవి.

అవి..

 • ఐ.పి.సి. (1860) సెక్షన్ 375- అత్యాచారం
 • ఐ.పి.సి. (1860) సెక్షన్ 354- దౌర్జన్యం, స్త్రీ అణకువకు భంగం కలిగించడం
 • ఐ.పి.సి. (1860) సెక్షన్ 377- అసహజ నేరం
 • ఐ.పి.సి. సెక్షన్ 511- నేరాలు చేయటానికి ప్రయత్నించడం

అయితే, ఇవి పిల్లలను సమర్థవంతంగా రక్షించలేకపోయేవి. అందుకని ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించిన వారికి ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 2012లో వచ్చిన ఫోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు.

మూలాలు

[మార్చు]
 1. "Child Sexual abuse and law". ChildLineIndia. Dr.Asha Bajpai. Archived from the original on 8 April 2019. Retrieved 17 July 2019.
 2. "Parliament passes bill to protect children from sexual abuse". NDTV. 22 May 2012. Archived from the original on 1 October 2014. Retrieved 23 May 2012.
 3. The Protection of Children from Sexual Offences Act, 2012 Archived 9 అక్టోబరు 2020 at the Wayback Machine Kerala Medico-legal Society website
 4. "Law for Protecting Children from Sexual Offences". Archived from the original on 3 January 2014. Retrieved 3 January 2014.
 5. Taneja, Richa (13 November 2010). "Activists bemoan lack of laws to deal with child sexual abuse". DNA India. Archived from the original on 16 May 2012. Retrieved 14 May 2012.
 6. "Need stricter laws to deal with child abuse cases: Court". The Indian Express. 12 April 2011. Retrieved 14 May 2012.
 7. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 22 May 2016. Retrieved 2018-09-28.
 8. Punj, Shweta (3 November 2017). "Human trafficking for sex: Thousands of girls live in slavery while society remains silent". India Today. Archived from the original on 15 December 2018. Retrieved 13 December 2018.
 9. "Article 21, Protection Of Life and Personal Liberty". Constitution Of India, CLPR. Archived from the original on 13 August 2022. Retrieved 2022-07-29.
 10. "Article 21 in The Constitution Of India 1949". indiankanoon.org. Archived from the original on 27 September 2018. Retrieved 2018-09-28.
 11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-08. Retrieved 2023-09-30.

బాహ్య లంకెలు

[మార్చు]