పోఖ్రాన్-II

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోఖ్రాన్-II
ఆపరేషన్ శక్తి
స్థూపాకార అణు బాంబు, దీనికంటే ముందు "శక్తి 1" ప్రయోగించారు.
సమాచారం
దేశముభారత దేశము
పరీక్షా ప్రదేశంపోఖ్రాన్ పరీక్షా రేంజ్, రాజస్థాన్, భారతదేశము
పరీక్షా కాలం11–13 మే 1998
పరీక్షల సంఖ్య5
పరీక్షా రకంఅండర్ గ్రౌండ్ టెస్టు
పరికర రకంవిఛ్ఛిత్తి/సంలీనం
Max. yield60 kilotons of TNT (250 TJ)
(Claimed by BARC)
Disputed Yields: See below[1][2][3]
గమనాగమనము
నేవిగేషన్
అంతకు ముందు పరీక్షPokhran-I (Operation Smiling Buddha)

పోఖ్రాన్-II పరీక్షలు అన్నది భారతదేశం భారత సైన్యానికి చెందిన పోఖ్రాన్ పరీక్షా రేంజిలో మే 1998లో నిర్వహించిన ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షలు.[4] భారతదేశం నిర్వహించిన రెండవ అణు పరీక్షలు ఇవి; మొదట 1974 మే నెలలో స్మైలింగ్ బుద్ధ అన్న సంకేత నామంతో తొలి పరీక్ష నిర్వహించారు.[5]

200 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేసి బయటకు విడువగల థర్మోన్యూక్లియర్ ఆయుధాలనూ, అణువిచ్ఛిత్తినీ తయారుచేయగల సామర్థ్యాన్ని భారతదేశానికి అందించడం వీటి ప్రధాన లక్ష్యం. పరీక్షలు ఆ ప్రధాన లక్ష్యాన్ని అందుకున్నాయి.[6] అప్పటి భారత అణు శక్తి కమిషన్ రాజగోపాల చిదంబరం పోఖ్రాన్-II పేలుళ్ళలో ఒకదాన్ని "ఇతర అణ్వస్త్ర దేశాలు దశాబ్దాల పాటు చేసిన వివిధ పరీక్షలకు సమానమైనదని" అభివర్ణించాడు.[7] భారతదేశం తర్వాత, పరీక్షలో ఉపయోగించిన పేలుడు పదార్థాల డిజైన్‌ను పోలిన డిజైన్ కలిగిన ఇతర న్యూక్లియర్ పేలుళ్ళ నుంచి వచ్చే శక్తిని ముందుగానే అంచనా కట్టగల కంప్యూటర్ స్టిమ్యులేషన్ సామర్థ్యాన్ని తాను సాధించిన విషయమూ నిరూపించింది.[8]

పోఖ్రాన్-II పరీక్షల్లో ఐదు విస్ఫోటనాలు జరిగాయి, మొదటిది ఫ్యూజన్ బాంబు కాగా మిగిలినవన్నీ ఫిషన్ బాంబులు (అణువిచ్ఛిత్తి బాంబులు).[9] ఆపరేషన్ శక్తి పేరిట ఒక ప్యూజన్ బాంబు, రెండు ఫిషన్ బాంబుల విస్ఫోటనంతో పరీక్షలు 1998 మే 11న ప్రారంభమయ్యాయి.[10] 1998 మే 13న అదనంగా మరో రెండు ఫిషన్ బాంబులు కూడా విస్ఫోటనం చేశారు.[11] ఇది జరిగిన కొద్దిసేపటికి ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ఒక పత్రికా సమావేశం నిర్వహించి భారతదేశం పూర్తి-స్థాయి అణ్వస్త్ర దేశమని ప్రకటించింది.[12] ఈ పరీక్షల కారణంగా తర్వాత జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహా పలు ప్రధాన దేశాలు భారతదేశంపై రకరకాల ఆంక్షలు విధించాయి.

ఈ పరీక్షలకు అనేక పేర్లు పెట్టారు. మొదట ఈ పరీక్షలను ఉమ్మడిగా ఆపరేషన్ శక్తి-98 అని పిలిచారు, ఐదు న్యూక్లియర్ బాంబులకు శక్తి-I నుంచి శక్తి-V వరకూ వరుసగా పేర్లు పెట్టారు. ఇటీవలి కాలంలో, ఆపరేషన్ మొత్తాన్ని కలిపి పోఖ్రాన్-II గానూ, 1974 నాటి విస్ఫోటనాన్ని పోఖ్రాన్-I గానూ వ్యవహరిస్తున్నారు.[13] భారత ప్రభుత్వం ఈ పరీక్షల్లో మొదటిది జరిగిన మే 11 తేదీని పోఖ్రాన్ II పరీక్షల జ్ఞాపకార్థం అధికారికంగా జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిచింది.[14] ఈరోజున ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషిచేసిన వివిధ వ్యక్తులు, పరిశ్రమలుకు పురస్కారాలు అందిస్తుంది.[14]

మూలాలు

[మార్చు]
 1. Overdorf, Jason (30 May 2010). "India's Nuclear Test 'Failure' Poses Threat To Obama's Nonproliferation Plans". Special report covered by Jason Overdorf. Global Post, 2010. Global Post. Retrieved 14 June 2015.
 2. "What Are the Real Yields of India's Tests?". Nuclearweaponarchive.org. Retrieved 31 January 2013.
 3. Bates, Crispin (2007). Subalterns and Raj: South Asia Since 1600. Routledge. p. 343. ISBN 978-0415214841.
 4. India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau, 1998. CNN India Bureau. Retrieved 14 June 2015.
 5. "Official press release by India". meadev.gov.in/. Ministry of External Affairs, 1998. Retrieved 14 June 2015.
 6. "Press Statement by Dr. Anil Kakodkar and Dr. R. Chidambaram on Pokhran-II tests". Press Information Bureau, Government of India. 24 September 2009. Archived from the original on 24 October 2017.
 7. "We have an adequate scientific database for designing ... a credible nuclear deterrent". Frontline. 16. January 2–15, 1999. Archived from the original on 28 అక్టోబరు 2019. Retrieved 7 జూన్ 2020.{{cite journal}}: CS1 maint: date format (link)
 8. "Press Statement by Dr. Anil Kakodkar and Dr. R. Chidambaram on Pokhran-II tests". Press Information Bureau, Government of India. 24 September 2009. Archived from the original on 24 October 2017.
 9. India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau, 1998. CNN India Bureau. Retrieved 14 June 2015.
 10. India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau, 1998. CNN India Bureau. Retrieved 14 June 2015.
 11. "The nuclear politics: The 1998 Election". Nuclear weapon archives. Nuclear politics. Retrieved 16 January 2013.
 12. "The nuclear politics: The 1998 Election". Nuclear weapon archives. Nuclear politics. Retrieved 16 January 2013.
 13. "Why May 11 be celebrated as National Technology Day? Things you should know". Times of India.{{cite web}}: CS1 maint: url-status (link)
 14. 14.0 14.1 Press Information Bureau (11 మే 2008). "National technology day celebrated". Department of Science and Technology. Archived from the original on 15 డిసెంబరు 2010. Retrieved 7 జూన్ 2020.