Jump to content

పోతురాజు పార్థసారథి

వికీపీడియా నుండి
పోతురాజు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1955 - 1962
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం
తరువాత కొండూరు మారారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1916
కోడూరు గ్రామం, రాజంపేట తాలూకా[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

పోతురాజు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. ఆయన 1955లో రాజంపేట నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా గెలిచాడు.

పార్థసారథి రాజంపేట తాలూకా కోడూరు గ్రామంలో 1916లో జన్మించాడు. తండ్రి గంగిచెట్టి. చదువు మానేసి శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. అడవి సత్యాగ్రహ ఉద్యమంలో తీవ్రమైన లాఠీ దెబ్బలు తిన్నాడు. వ్యక్తి సత్యాగ్రహంలో ఎనిమిది నెలల పాటు వెల్లూరు, అలీపురం జైళ్ళలో కఠిన కారాగారశిక్షను అనుభవించాడు. 1943లో క్విట్ ఇండియా ఉద్యమసమయంలో మద్రాసులోని కళాశాల విద్యార్ధులను, కళాశాలను బహిష్కరించమని రెచ్చగొట్టినందుకు ఆరు నెలల కఠిన శిక్షను అలీపురం క్యాంపు జైల్లో అనుభవించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి, కాళిదాసు కుమారసంభవాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.[1]

1935 నుండి 1938 వరకు అఖిల భారత కాంగ్రేసు కమిటీ సభ్యుడిగానూ, జిల్లా కాంగ్రేసు సంఘ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశాడు. 1955 నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1967లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1971లో తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యాడు[1] 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, పోతురాజు పార్థసారథి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత వరుసగా 1971, 1977, 1980లో ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. 1970 నుండి 1971 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఉపమంత్రిగా కొన్నాళ్ల పాటు పనిచేశాడు. 1967 నుండి 1984 వరకు సుమారు 17 ఏళ్లపాటు రాజంపేటకు లోక్‌సభలో ఈయనే ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 508. Retrieved 12 August 2024.