పోరంకి దక్షిణామూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరంకి దక్షిణామూర్తి
పోరంకి దక్షిణా మూర్తి ని వేదగిరి రాంబాబు సత్కరిస్తున్న దృశ్యం
జననం
పోరంకి దక్షిణామూర్తి

1935 డిసెంబరు 24
ఆలమూరు గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిడిప్యూటీ డైరెక్టరు, తెలుగు అకాడెమీ

డా. పోరంకి దక్షిణామూర్తి[1] రచయిత, వ్యాసకర్త. 1935 డిసెంబరు 24 న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో దక్షిణామూర్తి జన్మించారు. తెలుగు అకాడమీ ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు. డిగ్రీ వరకూ కాకినాడలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం, అదే యూనివర్సిటీలో తెలుగు శాఖ రీడర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1969లో తెలుగు అకాడమీకి బదిలీ అయ్యారు. ఆ సమయంలో పలు నిఘంటు నిర్మాణాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. వృత్తి పదకోశం రూపకల్పనలో ప్రఖ్యాత భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తికి సహాయకుడిగా పని చేశారు. నలభై వేల పదాలతో ‘ఇంగ్లిషు-తెలుగు-ఇంగ్లిషు’ నిఘంటువును సంకలనం చేశారు.

ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశారు. తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్‌ ‌పట్టా పొందారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు.

పాఠ్య పుస్తకాల రూపకల్పనలోనూ ముఖ్య భూమిక పోషించారు. తెలుగు అకాడమీలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన పోరంకి దక్షిణామూర్తి డిప్యూటీ డైరెక్టరుగా 1993లో పదవీ విరమణ చేశారు. అనంతరం పాత్రికేయ విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించారు. తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’, రాయలసీమ మాండలికంలో ‘రంగవల్లి’, కోస్తాంధ్ర మాండలికంలో ‘వెలుగూ వెన్నెలా గోదారి’ నవలలను ఆయన రచించారు. అలా మూడు మాండలికాల్లోనూ నవలలు రచించిన తొలి వ్యక్తిగా ఖ్యాతి పొందారు.

కథలు, నవలలు, పరిశోధనా వ్యాసాలతో కలిపి సుమారు 40 పుస్తకాలు రచించారు. లెక్కకు మిక్కిలిగా అనువాదాలు చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా, పరమహంస యోగానంద జీవిత చరిత్ర ఒక యోగి ఆత్మకథను తెలుగులోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియా యోగులందరికీ ఇది ఓ పాఠ్య గ్రంథమైంది. ఇదే పుస్తకానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ప్రదానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కమిటీకి సభ్యుడిగానూ ఆయన పని చేశారు.

రచనలు

[మార్చు]

పోరంకి దక్షిణామూర్తి రచించిన కొన్ని పుస్తకాల జాబితా ఇది

కథానికా సంపుటాలు

[మార్చు]
  1. భక్తులకథలు (రెండు భాగాలు)
  2. చంద్రవంక

నవలలు

[మార్చు]
  1. వెలుగు వెన్నెల గోదారి
  2. ముత్యాలపందిరి
  3. రంగవల్లి
  4. నివేదన
  5. నీడలూ జాడలూ

వ్యాస సంపుటాలు

[మార్చు]
  1. భాష - ఆధునిక దృక్పథం
  2. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాండలికాలు
  3. గురజాడ'సారంగధర': మరికొన్ని వ్యాసాలు
  4. అదొక్కటి తెలుసుకోచాలు (ఆధ్యాత్మిక వ్యాసాలు)
  5. ఉన్నది ఉన్నట్టు[2] (పుస్తక సమీక్షలు)
  6. అరచేతి అద్దంలో[3] (పీఠికలు)


పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథం

[మార్చు]
  1. కథానిక స్వరూపస్వభావాలు[4]

నిఘంటువులు

[మార్చు]
  1. తెలుగు పదబంధకోశం
  2. ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు (పరిష్కరణ)
  3. తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు
  4. మాండలిక వృత్తిపదకోశం - మేదర పరిశ్రమ
  5. మాందలిక వృత్తిపదకోశం - చేనేత పదాలు
  6. తెలుగు - తెలుగు నిఘంటువు (పరిష్కరణ)

అనువాద గ్రంథాలు

[మార్చు]
  1. మన ఆధ్యాత్మిక వారసత్వం (అనువాదం)
  2. సద్గురు స్వామి నిగమానంద సరస్వతి (అనువాదం)
  3. గురజాడ 'డిసెంట్ పత్రం'
  4. ఒక యోగి ఆత్మకథ (పరమహంస యోగానంద జీవితచరిత్ర)

ఇతర గ్రంథాలు

[మార్చు]
  1. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (మోనోగ్రాఫ్) ISBN 81-260-2157-8
  2. తెలుగు ఉన్నత వాచకం[5]

పురస్కారాలు

[మార్చు]
  • 1995లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers. న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 261. ISBN 81-260-0873-3. Retrieved 29 December 2014.
  2. సుధామ (2013-11-23). "చతురత, అధ్యయన శీలతల మేలు కలయిక". ఆంధ్రభూమి. Retrieved 29 December 2014.[permanent dead link]
  3. ఎస్. (2013-12-14). "ఒకటేమిటి.. అరచేతి అద్దంలో.. అన్నీ". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 29 December 2014.[permanent dead link]
  4. పోరంకి, దక్షిణామూర్తి (1988). కథానిక స్వరూప స్వభావాలు. హైదరాబాద్: పోరంకి దక్షిణామూర్తి. Retrieved 29 December 2014.[permanent dead link]
  5. పోరంకి, దక్షిణామూర్తి (1989). తెలుగు ఉన్నత వాచకం (1 ed.). హైదరాబాదు: తెలుగు అకాడెమీ. Retrieved 29 December 2014.
  6. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.