పోర్ట్ ట్రస్ట్ బోర్డు (భారతదేశం)
నౌకాశ్రయ పాలకసంస్థ (పోర్ట్ ట్రస్ట్ బోర్డు), ఇది భారతదేశ పౌర, సముద్ర చట్టం ప్రకారం, వాణిజ్య నౌకాశ్రయం ద్వారా సరుకులు రవాణా, వాణిజ్యాన్ని నిర్వహించడానికి చట్టబద్ధమైన అధికారంతో ఏర్పడిన ఒక పరిపాలనా సంస్థ.భారత నౌకాశ్రయ పాలకసంస్థ చట్టం ఆమోదించిన తరువాత భారతదేశపు మొట్టమొదటి నౌకాశ్రయ పాలకసంస్థ (పోర్ట్ ట్రస్ట్ బోర్డు) 1870 లో కలకత్తా నౌకాశ్రయానికి స్థాపించబడింది. ఆ తరువాత ఇలాంటి పాలక సంస్థలు 1879 లో బొంబాయి,1905 లో మద్రాసు నౌకాశ్రయాలకు ఏర్పాటు చేయబడ్డాయి.నౌకాశ్రయ పాలకసంస్థ పరిపాలనను 1963 లో జాతీయ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురాబడింది.దీనివలన "ప్రధాన ఓడరేవులను" సముద్ర తీర ప్రాంతంలోని, సముద్రతీరంలో ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూములను నౌకాశ్రయ పాలకసంస్థ యాజమాన్యంతో ప్రకటించటానికి వీలు కల్పించింది. గతంలో వివిధ చట్టాల క్రింద స్థాపించబడిన అన్ని ఓడరేవులను పరిధిలోకి తీసుకువచ్చారు ఈ కొత్తగా అమలు చేయబడిన చట్టం.
పాలక మండలి సభ్యులు
[మార్చు]1963 చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, ఇతర ధర్మకర్తలు ప్రాతినిధ్యం వహించేటట్లు వీలుకల్పించబడింది.(1) అందలో ఓడరేవులో పనిచేసే కార్మికులలో కనీసం ఇద్దరు ప్రతినిధులుకు, (2) ఓడ యజమానులుకు ముగ్గురుకు (3) సెయిలింగ్ నాళాల యజమానులు (4) రవాణాదారులు (5)కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఇతర ఆసక్తులు కలిగిన స్థానికులుకు ప్రాతినిధ్యం లభించింది.ధర్మకర్తల మండలికి ఆచరణాత్మకంగా స్వయంప్రతిపత్తి నామమాత్రంగా ఉంటుంది.దీనిమీద కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నాయి. ఓడరేవులో పనిచేసే కార్మికులను సూచించే ట్రేడ్ యూనియన్ నాయకులను మామూలుగా 1990 ల ప్రారంభం వరకు ధర్మకర్తల మండలికి నియమించారు. అయితే కంటైనరైజేషన్ రావడంతో గణనీయంగా ప్రధాన నౌకాశ్రయాల వద్ద స్టీవెడోర్ ఉద్యోగులను తగ్గించింది. దాని పర్యవసానంగా వివిధ పోర్ట్ ట్రస్టులపై కార్మిక ప్రాతినిధ్యం ఇటీవల సేవలు, పరిపాలన విధులను నిర్వహిస్తున్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల నుండి తీసుకోబడిన పౌర సేవకులతో నింపారు.
పోర్ట్ ట్రస్ట్ బోర్డుల జాబితా
[మార్చు]ప్రస్తుతం భారతదేశంలో 13 "ప్రధాన ఓడరేవులు" ఉన్నాయి. ఎన్నోర్ పోర్ట్ మినహా మిగిలినవి నౌకాశ్రయ ధర్మకర్తల పాలకసంస్థ నిర్వహించబడతున్నాయి. ఎన్నోర్ నౌకాశ్రయం అనేది భారత ప్రభుత్వ సంస్థ. ఇది హామీ ద్వారా పరిమితం చేయబడింది. ఇది పూర్తిగా జాతీయ ప్రభుత్వానికి చెందింది.
పోర్ట్ ట్రస్ట్ బోర్డు ఉన్న ఓడరేవులు
- ముంబై [1]
- కోల్‌కతా [2]
- చెన్నై [3]
- కండ్ల [4]
- జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (ముంబై సమీపంలో) [5]
- మోర్ముగావ్ [6]
- న్యూ మంగళూరు [7]
- కొచ్చిన్ [8]
- విఒ చిదంబరనార్ పోర్ట్ [9]
- పోర్ట్ బ్లెయిర్ (అండమాన్, నికోబార్ దీవులు)
- విశాఖపట్నం [10]
- పారాడిప్ [11]
మూలాలు
[మార్చు]- ↑ "Mumbai Port Trust Board of Trustees". Mumbai Port Trust. 2018. Retrieved 7 January 2018.
- ↑ Kolkata Port website
- ↑ "Port of Chennai". www.chennaiport.gov.in. Archived from the original on 4 March 2007. Retrieved 12 January 2018.
- ↑ "Kandla Port website". Archived from the original on 22 July 2018. Retrieved 13 May 2012.
- ↑ "JN Port website". jnport.com. Archived from the original on 25 మే 2012. Retrieved 12 January 2018.
- ↑ "Mormugao Port Trust". www.mptgoa.com. Archived from the original on 21 February 2009. Retrieved 12 January 2018.
- ↑ "Home - New Mangalore Port - Building trust for businesses". www.newmangalore-port.com. Archived from the original on 5 మే 2017. Retrieved 12 January 2018.
- ↑ "Cochin Port Trust, Kerala, India, Ports, CPT, Shipping, Ships, Transport, Indian, India on Internet,Careers,jobs in Cochin port trust, Daily Vessel Position, cargo, water transport, container, passenger ships, vessel,wharf". www.cochinport.com. Retrieved 12 January 2018.
- ↑ "Welcome to V.O.Chidambaranar Port Trust". www.vocport.gov.in. Archived from the original on 28 June 2015. Retrieved 12 January 2018.
- ↑ fullahead.org. "VISAKHAPATNAM PORT TRUST - HOME PAGE". www.vizagport.com. Archived from the original on 3 మే 2014. Retrieved 12 January 2018.
- ↑ "HOME :: Welcome to Paradip Port". www.paradipport.gov.in. Archived from the original on 24 February 2018. Retrieved 12 January 2018.