ప్రతాప్ చంద్ర సారంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతాప్ చంద్ర సారంగి
ప్రతాప్ చంద్ర సారంగి

ప్రతాప్ చంద్ర సారంగి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2019 - 2024
ముందు రబీంద్ర కుమార్ జేన
నియోజకవర్గము బాలసోర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
ఒరిస్సా నీలగిర్
రాజకీయ పార్టీ బీజేపీ
నివాసము నీలగిర్
మతం హిందు

[1]

జననం వ్యక్తిగత జీవితం[మార్చు]

ఒడిశా మోదీ అని పిలుచుకునే ప్రతాప్ చంద్ర సారంగి 1955లో నీలగిర్ ప్రాంతంలోని గోపీనాథపురం, ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.కుర్తాపైజామాలో గుబురు గడ్డంతో ప్రతాప్ చంద్ర సారంగి సామాన్యుడిలా కనిపిస్తారు.ఉత్కళ యూనివర్శిటీ పరిధిలోని బాలాసోర్‌లోనే డిగ్రీ వరకూ చదివాడు. డిగ్రీ కాగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి, ప్రజాసేవకు అంకితం అయ్యారు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ప్రతాప్ చంద్ర సారంగి స్వతహాగా సామాజిక కార్యకర్త అయిన సారంగి బీజేపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  • 2004 నుంచి 2014 వరకు నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
  • 2014 ఎన్నికల్లో బాలాసోర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
  • 2019 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి బిజు జనతా దళ్‌ అభ్యర్థి రబీంద్ర కుమార్‌ జేనపై 12,956 ఓట్ల తేడాతో గెలుపొందారు.[3]
  • 2019 లో,సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి అయ్యారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Shri Pratap Chandra Sarangi Profile". Naveen Patnaik, Chief Minister of Odisha website. Retrieved 2014-05-25. Cite web requires |website= (help)
  2. "Shri Pratap Chandra Sarangi Profile". My neta info. Retrieved 2019-04-26. Cite web requires |website= (help)
  3. "'No clash between Modi wave and my image': Pratap Sarangi". The Times of India. May 23, 2019. Retrieved 2019-05-23. Cite web requires |website= (help)
  4. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019