మహాడ్ సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎నేపథ్యం[1]: నేపథ్యంలో తేది రాసి సంవత్సరం రాయలేదు. ఇపుడు చేర్చాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15: పంక్తి 15:


== సంఘటనానంతరం ==
== సంఘటనానంతరం ==
సమావేశం తర్వాత తమ తమ గ్రామాలకి తిరిగి వెళ్ళిన దళితులకి అక్కడ కూడా ఈ సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన సవర్ణ హిందువులు దాడి చేశారు. మహాడ్ లోని సంప్రదాయవాదులు తమ ఊరి చెరువు మలినమైపోయిందని, బ్రాహ్మణ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య దానికి శుద్ధి సంస్కారాలు చేసి, మళ్ళీ సవర్ణ హిందువులు ఈ చెరువు నీటిని తాగొచ్చని ప్రకటించారు.
సమావేశం తర్వాత తమ తమ గ్రామాలకి తిరిగి వెళ్ళిన దళితులపై అక్కడ కూడా ఈ సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన సవర్ణ హిందువులు దాడి చేశారు. మహాడ్ లోని సంప్రదాయవాదులు తమ ఊరి చెరువు మలినమైపోయిందని, బ్రాహ్మణ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య దానికి శుద్ధి సంస్కారాలు చేసి, మళ్ళీ సవర్ణ హిందువులు ఈ చెరువు నీటిని తాగొచ్చని ప్రకటించారు.


== చరిత్రలో మహాడ్ ==
== చరిత్రలో మహాడ్ ==

02:05, 26 మార్చి 2021 నాటి కూర్పు

మహాడ్ సత్యాగ్రహం నేపథ్యంతో ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ బొమ్మతో భారతదేశంలో విడుదల చేసి 1991 నాటి స్టాంపు

మహాడ్ సత్యాగ్రహం ఊరి చెరువు నుండి మంచినీరు తాగడానికి బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో దళితులు చేసిన శాంతియుత విప్లవం. ఇది ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాడ్ ప్రాంతంలో 1927లో మార్చి 21వ తేదీన జరిగింది. దీనినే చవదార్ చెరువు సత్యాగ్రహం అనీ, మహాడ్ ముక్తిసంగ్రామం అనీ పిలుస్తారు. ఈ సంఘటనని తలుచుకుంటూ ఈరోజుని భారతదేశంలో సామాజిక సాధికారికత (Social Empowerment) దినోత్సవంగా జరుపుకుంటారు.

నేపథ్యం[1]

భారతీయ కుల వ్యవస్థలో దళితులు ఎన్నో విధాల వివక్షకు గురయ్యారు. ఇందులో ఒకటి జనం నీళ్ళు తాగడం కోసం ఉన్న చెరువులను వాళ్ళని వాడుకోనివ్వకపోవడం. దీనికి వ్యతిరేకంగా బాంబే రాష్ట్ర శాసనమండలి 1923 ఆగస్టులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో ఎవరైనా నీళ్ళు తాగవచ్చని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనిని అమలుపరచడానికి జనవరి 1924లో మహాడ్ పురపాలక మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, సవర్ణ హిందువుల నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ తీర్మానం ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు.

ఈ నేపథ్యంలో కొలాబా జిల్లా అణుగారిన వర్గాల సంఘం వారు దళిత సానుభూతిపరులైన స్థానిక సవర్ణ హిందువులతో కలిసి మహాడ్ లో 1927 మార్చి 19-20 మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించదలుచుకుని బి.ఆర్. అంబేడ్కర్ ను దానికి ఆహ్వానించారు. ఈ సమావేశం గురించి తెలుసుకుని దాదాపు పదివేల మంది వివిధ వయసుల దళిత ప్రజలు మహారాష్ట్ర, గుజరాత్ లలోని చాలా ఊళ్ళ నుండి తరలి వచ్చారు. వీరందరికీ మంచినీటి సరఫరాకి వసతి లేక సవర్ణ హిందువుల నుండి నలభై రూపాయలకి నీటిని కొనుక్కున్నారు సమావేశ నిర్వహకులు.

సమావేశం తొలి దినం అంబేడ్కర్ సహా పలు ప్రముఖుల ప్రసంగాలు ముగిశాక, తమ సానుభూతిపరులైన సవర్ణ హిందువుల అభిప్రాయాలు కూడా సేకరించాక మరుసటి రోజు అందరూ కలిసి మహాడ్ లో ఉన్న చవదార్ చెరువు వద్దకు వెళ్ళి దళితుల నీటి హక్కును సత్యాగ్రహ పద్ధతిలో ఉద్ఘాటించాలని నిర్ణయించుకున్నారు.

సత్యాగ్రహం

మార్చి 20 వ తేదీ ఉదయం ముందు రోజు రాత్రి అనుకున్నట్లే అంబేడ్కర్ నేపథ్యంలో అందరూ కలిసి తమ నీటి హక్కుని ప్రకటించడానికి చవదార్ చెరువుకు వెళ్ళారు. తొలుత అంబేడ్కర్ చెరువు నుండి నీళ్ళు తాగాడు. తరువాత ఒకరి వెంట ఒకరు తక్కిన దళితులు కూడా ఈ చెరువులోని నీళ్ళు తాగి, శాంతియుతంగా తిరిగి సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన రెండు గంటలకి దళితులు దగ్గర్లోని వీరేశ్వర దేవాలయంలోకి కూడా వెళ్ళబోతున్నారన్న పుకారు వల్ల అది గిట్టని సవర్ణ హిందువులు కొందరు సమావేశ వేదికను చేరి అక్కడున్న వారిపై దాడి చేశారు. అంబేడ్కర్ వారించడంతో దళితులు అహింసను అవలంబించారు. తరువాత పోలీసులు వచ్చి దాడి చేసిన వారిపై చర్య తీసుకున్నారు.

సంఘటనానంతరం

సమావేశం తర్వాత తమ తమ గ్రామాలకి తిరిగి వెళ్ళిన దళితులపై అక్కడ కూడా ఈ సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన సవర్ణ హిందువులు దాడి చేశారు. మహాడ్ లోని సంప్రదాయవాదులు తమ ఊరి చెరువు మలినమైపోయిందని, బ్రాహ్మణ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య దానికి శుద్ధి సంస్కారాలు చేసి, మళ్ళీ సవర్ణ హిందువులు ఈ చెరువు నీటిని తాగొచ్చని ప్రకటించారు.

చరిత్రలో మహాడ్

మహాడ్ సత్యాగ్రహాన్ని తొలి దళిత విప్లవంగా భావిస్తారు. ఈ ఉదంతాన్ని గురించి ఆనంద్ తెల్తుంబ్డే అన్న రచయిత "Mahad: The Making of the First Dalit Revolt, with the Account of Comrade R.B. More, the Chief Organizer of the First Conference" అన్న పుస్తకం రాశాడు.

మూలాలు