"అబ్బూరి ఛాయాదేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
'''అబ్బూరి ఛాయాదేవి''' ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. ఈమె [[రాజమండ్రి]]లోభర్త జన్మించారు.అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా ప్రముఖ తెలుగు రచయిత.
 
 
ఛాయాదేవి [[రాజమండ్రి]]లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.<ref>[http://www.wworld.org/programs/regions/india/telugu.htm Why do women write? - Telugu Writers' Workshop] Women's WORLD</ref> 1951-53 మధ్య [[నిజాం కళాశాల]] నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన ''అనుభూతి'' వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/416100" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ