గింజలను ఆరబెట్టుట

వికీపీడియా నుండి
10:02, 22 మే 2021 నాటి కూర్పు. రచయిత: MYADAM ABHILASH (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

పంటకోసిన తర్వాత గింజల్లో ఉన్న తేమ శాతాన్ని తగ్గించి ఆహారానికి , విత్తన వృద్ధికి ఉపయోగిస్తారు. కోసిన ధాన్యములను యంత్ర సహాయమున గింజలను ఆరబెట్టుటకు సహజ సిద్ధమైన గాలి లేక వేడిచేసిన గాలిని గింజల ద్వారా ప్రవహింపజేసి అందులోని తేమ శాతం తగ్గించవచ్చును . గింజలలోనున్న తేమ శాతమును డ్రైయర్లలను ఉపయోగించి తగ్గించవచ్చును.[1]

డ్రైయర్లలో రకములు

ప్యాక్ డ్రైయర్

ఈ విధానమునందు ఒక పెద్ద గదిలో నేలపై భాగమున పెద్ద పెద్ద గాడులు తయారు చేసి వాటిపై రంధ్రములు కలిగిన స్టీలు రేకులను అమర్చుదురు . బయటనుండి అయిల్ ఇంజనును లేక కరెంట్ మోటారు ద్వారా నడుపబడు బ్లోయరు ద్వారా గాలిని గదిలోనికి పంపుదురు . ఈ గాలి వివిధ గాడుల ద్వార మరియు స్టీలు రెకుల పై గల రంధ్రముల ద్వార సంచిలో యున్న గింజలకు తగిలి గింజల తేమ శాతమును తగ్గించును.

బ్యాచ్ లేక బిన్ డ్రైయరు

ఈ పద్ధతి యందు గింజలను విడిగా కాని , ఒక పద్ధతి యందు గింజలకు చలనమునందు ఉంచి 1 నుండి 2 టన్నుల వరకు ఆరబెట్టే డ్రైయరులను బ్యాచి డ్రైయర్లు అని అంటారు. 3 లేక అంతకంటే ఎక్కువ ఆరబెట్టే డ్రైయర్లను బిన్ డ్రైయరులు అని అంటారు . , దీర్ఘచతురస్రాకారము, క్రమపడ్భుజి ఉండి వాటిని ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తీసుకపొవుటకు అనువుగా “ ట్రాన్సు పొర్టింగ్ వీల్సు " అమర్చబడి యుండును .[2]

ఎల్.ఎస్. యు. డ్రైయర్

ఎల్ ఎస్ యు డ్రైయర్ అనగా లూసియానా స్టేట్ యూనివర్శిటీ డ్రైయర్. ఈ డ్రైయరులో ముఖ్యముగా గింజలను ఉంచుటకు బిన్ను లేక హాపరు , డ్రైయింగ్ చాబరు గింజలను క్రిందకు పంపే మెకానిజం లేక పద్దతి , బ్లోయరు, గాలిని వేడిచేయు యంత్రము , గాలిని ప్రవహింపచేయుటకు త్రిభుజూకారములో రంధ్రములుండును . ఇందులో గింజలను ఉంచు బిన్ను , డ్రైయింగ్ చాంబరు చతురస్రాకారములో ఉండి 1.2 x 1.2 మీటర్లు , 1.5 X 1.5 మీటర్లు , 1.8 x 1.8 మీటర్లు 2.11 2.1 మీటర్లు కొలతలు కలిగి యుండును డ్రైయరు ఎత్తు దీని కెపాసిటిని బట్టి ఉండును . డ్రైయింగ్ చాంబరునకు ఒక వైపు త్రిభుజాకారములో వేడిగాలి ప్రవహింప చేయుటకు సమాన సంఖ్యలో మరియు సమాన పరిమాణముగల ఇన్లెట్ట్ , అవుట్ చానల్స్ లేక ప్రవాహ గాడులు ఉండును .

ఇన్లెట్ ఛానల్స్ అనగా వేడి గాలిని బ్లోయరువద్ద నుండి డ్రైయింగు చాంబరు లోనికి ప్రవహింప చేయునవి ఎగ్జాస్ట్ లేక అవుట్ లెట్ అనగా గింజలను తాకిన తరువాత గాలి , డ్రైయింగ్ చాంబరు నుండి బయటకు ప్రవహింప చేయునది . ఈ విధముగా మొదటి వరుస ఇన్లేట్ ఛానల్స్ అయినా రెండవ వరుస ఎగ్లాస్ ఛానల్స్ ఆగును . ఈ విధముగా 1,3,5,7,9 వరుస ఛానల్స్ ఇన్ లేట్ గాను 2,4,6,8,10 వరుస చానల్స్ అవుటైట్ ఛానల్స్ ఆగును . బ్లోయరు నుండి గాలిని ప్రవహింప చేయుటకు అనుకూలముగా బ్లోయరు వైపు ఇన్ ఛానల్స్ తెరువబడి యుండి రెండవ ప్రక్క మూయబడి యుండును . అందువలన గాలి నేరుగా ఛానల్ ద్వారా బయటికి పొదు . అవుటైట్ ఛానల్ నందు బ్లోయరు వైపు మూయబడి యుండి రెండవ ప్రక్క తెరువబడి యుండును .[2]

  1. Crop production and farm machanization. Ekalavya organic agriculture.
  2. 2.0 2.1 {{cite web}}: Empty citation (help)CS1 maint: url-status (link)