సర్బానంద సోనోవాల్
స్వరూపం
సర్బానంద సోనోవాల్ (జననం 1961 అక్టోబర్ 31) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఇతను 2016 నుండి 2021 వరకు అస్సాం 14 వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 16 వ భారత పార్లమెంటుకు అస్సాంలోని లఖింపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాడు. ఇతను అస్సాంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు. 2021 జులై 7న పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ, ఆయుష్ శాఖలకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.