నాళం సుశీలమ్మ

వికీపీడియా నుండి
12:21, 3 మార్చి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మధుర కవి నాళం కృష్ణారావు గారి సతీమణి శ్రీమతి నాళం సుశీలమ్మ గారు. శ్రీ కృష్ణారావు గారు ఆనాడు పేరొందిన గౌతమీ గ్రంధాలయం స్థాపించాడు. "మానవసేవ" అనే పత్రిక నడిపారు. సంఘ సంస్కర్త అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడచి అక్షరాల ధర్మపత్ని అనిపించుకున్నవారు సుశీలమ్మ గారు. ఆమెకు సాహిత్య పరిచయాన్ని కృష్ణారావు గారే కలిగించారు. ఆమె బాపూజీ ప్రేరణతో విదేశీ వస్త్ర దహనం చేసింది. రాట్నం తో నూలు వడకటం, ఆ నూలుతో గుడ్డలు నేయటం అలవాటు చేసుకుంది. పూర్తి ఖద్దరె కట్టింది. ఇతరులు చేత కట్టించేది. వీణా వాద్యంలో కూడా ఆమెకు నైపుణ్యం ఉంది. ప్రకృతి వైద్యం తెలిసిన మహిళ. ఆంధ్ర మహిళా గాన సభ అనె సంస్థను స్థాపించింది. దాని అభివృద్ధికి ఎంతో కృషి చేసింది.