ప్రధానమంత్రి జన ధన యోజన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రారంబించిన పథకాలలో జన ధన యోజన ప్రముఖమైనది. ప్రజలకు బ్యాంకింగ్, బీమా, పించను, నగదు బదిలీ, రుణ సదుపాయం వంటి అనేక ఆర్థిక సేవలను తక్కువ ధరకే అందించటమే ఈ పథకం యొక్క లక్ష్యం. అన్ని బ్యాంకు శాఖలలో లేదా బ్యాంకు మిత్ర (బిజినెస్ కరెస్పాండంట్) వద్ద కానీ జన ధన ఖాతాలను తెరవవచ్చు. 15.08.2014 తేదీన ఈ పథకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారభించబడింది.

సదుపాయాసలు వరించు:

కనీస నగదు జమ లేదు ఉచితంగా రూపే డెబిట్ కార్డ్ లక్ష రూపాయల ఉచిత ప్రమాద జీవిత బీమా (బీమా కోసం డెబిట్ కార్డ్ ను ప్రతి 45 రోజులకు ఒకసారన్నా వాడాలి) అదనంగా ౩౦,౦౦౦ ఉచిత జీవిత బీమా రూ. 5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం (ఆరు నెలల కార్యకలాపాల అనంతరం – ఇంటికి ఒకరికి చొప్పున – స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.) దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా సులభ నగదు బదిలీ

సదుపాయాలు[మార్చు]

  1. కనీస నగదు జమ లేదు
  2. ఉచితంగా రూపే డెబిట్ కార్డ్
  3. లక్ష రూపాయల ఉచిత ప్రమాద జీవిత బీమా (బీమా కోసం డెబిట్ కార్డ్ ను ప్రతి 45 రోజులకు ఒకసారన్నా వాడాలి)
  4. అదనంగా ౩౦,౦౦౦ ఉచిత జీవిత బీమా
  5. రూ. 5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం (ఆరు నెలల కార్యకలాపాల అనంతరం – ఇంటికి ఒకరికి చొప్పున – స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.)
  6. దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా సులభ నగదు బదిలీ

కావలసిన పత్రాలు: రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గ్రామ సర్పంచ్ జారీ చేసిన ధృవీకరణ పత్రం - వీటిల్లో ఏదేని ఒక ఆధార పత్రం (ప్రస్తుత చిరునామా, ఫోటో ఉన్నది) నకలు సమర్పించాలి.

ఇదివరకే బ్యాంకు ఖాతా ఉన్నవారు జన ధన యోజన ప్రయోజనాలకోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదు. ఇదివరకే ఖాతా ఉన్నవారు కొత్తగా రూపే కార్డ్ పొంది తద్వారా బీమా ప్రయోజనాలు పొందవచ్చు, సంతృప్తికరమైన రీతిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించి రుణ సదుపాయం కూడా పొందవచ్చు. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన ధన ఖాతా తెరవవచ్చు.

ఇవికూడా చూడండి[మార్చు]