సుకన్య సమృద్ధి ఖాతా
సుకన్య సమృద్ధి ఖాతా అనేది ఆడపిల్ల సంపద పథకం. ఆడ పిల్లల కోసం 2015 జనవరి 22 న ప్రధాని నరేంద్ర మోదీచే ప్రారంభించబడిన ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 8.1 వడ్డీ అందించబడుతుంది- దీనికి ఎటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్స్ ఖాతా. దీనిని ప్రారంబించడనికి పోస్టాఫీసులో కాని అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం రూ 250/- (ఇదివరకు 1,000/- ఉంది) చేయాలి. ఈ పథకం క్రింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ఈ ఖాతా తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చులు నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోనవచ్చును. ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి 21 సంవత్సరాలు వరకు నిర్వహించవచ్చు.[1]
లక్షణాలు
[మార్చు]- సుకన్య సంవృద్ధి ఖాతా:
ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి. తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.
- ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/-, గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు.
- ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది.
- ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును.
- సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది.
- ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.
సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
[మార్చు]- బాలిక జనన ధృవీకరణ పత్రం
- తల్లిదండ్రుల చిరునామా రుజువు
- తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sukanya Samriddhi Account Scheme". www.nsiindia.gov.in. Retrieved 2022-11-23.