ప్రపంచ తాబేలు దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ తాబేలు దినోత్సవం
ప్రపంచ తాబేలు దినోత్సవం
తాబేలు
జరుపుకొనేవారుఅమెరికన్ తాబేలు రెస్క్యూ
ప్రారంభం2000
జరుపుకొనే రోజుమే 23
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ తాబేలు దినోత్సవం (ఆంగ్లం: World Turtle Day) ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3]

చరిత్ర

[మార్చు]

1990లో అమెరికా లోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000లో మిస్ ఇ. రస్సెల్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించాడు.[4]

కాలిఫోర్నియాలోని మాలిబుకు చెందిన సుసాన్ టెల్లెం వరల్డ్ టర్త్లి డే (ప్రపంచ తాబేలు దినోత్సవం) అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేశాడు.[5]

జంతువుల వేడుకలకు సంబంధించిన చేజ్ అనే పుస్తకంలో ఈ దినోత్సవం గురించి ప్రస్తావించబడింది.[6]

కార్యక్రమాలు

[మార్చు]
మే 23 - ప్రపంచ తాబేలు దినోత్సవం
తాబేలు

ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు.

  1. తాబేళ్ళు, తాబేళ్ళ బొమ్మలను చాలామంది ఒకరికొకరు ఇచ్చుకుంటారు.
  2. తాబేళ్ళ వంటి దుస్తులు లేదా ఆకుపచ్చ వేసవి దుస్తులు ధరించి వీధులలో ప్రచారం చేయడం.
  3. రహదారులపై చిక్కుకున్న తాబేళ్ళను కాపాడడం.
  4. తాబేళ్ళకు సంబంధించిన పరిశోధనలు జరపడం.
  5. పాఠశాలల్లో విద్యార్థులకు తాబేళ్ళ గురించి బోధించడం.[7]
  6. 2013లో 5,500 మంది విద్యార్థులకు భోదించడానికి తాబేలు దినోత్సవ బోధన సామగ్రిని పంపించారు.


మూలాలు

[మార్చు]
  1. "Be Kind to Turtles, World Turtle Day is May 23". WorldTurtleDay.org. Archived from the original on 29 ఆగస్టు 2016. Retrieved 23 May 2020.
  2. "Celebrate World Turtle Day". Archived from the original on 15 ఫిబ్రవరి 2009. Retrieved 23 May 2020.
  3. Wendy Heller (13 May 2008). "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Archived from the original on 4 జూలై 2008. Retrieved 23 May 2020.
  4. "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Health News Digest. 13 May 2008. Archived from the original on 27 మే 2009. Retrieved 23 మే 2020.
  5. "USPTO trademark #4635425".
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-08. Retrieved 2020-05-23.
  7. "How to Celebrate World Turtle Day?". Bee Bulletin.

ఇతర లంకెలు

[మార్చు]