Jump to content

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
జరుపుకొనేవారుఅంతర్జాతీయ వినియోగదారుల సంఘం
ప్రారంభం1983
జరుపుకొనే రోజుమార్చి 15
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది.[1] వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

చరిత్ర

[మార్చు]

1962 మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.[2] 1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.[3] 1989 మార్చి 15న భారత ప్రభుత్వం వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది.[4]

కార్యక్రమాలు

[మార్చు]

ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.

  1. బులిటెన్‌లు, పీరియాడికల్స్‌, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా వినియోగ పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం
  2. వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తుసేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గూర్చి వారిలో చైతన్యం పెంచడం
  3. వినియోగదారులకు న్యాయవేదికల గూర్చి తెలపడం, వినియోగమోసాల గురించి ముద్రించి ప్రచారం చేయడం, నష్టపరిహారం చెల్లించిన కేసుల గూర్చి ప్రచారం చేయడం

థీమ్స్

[మార్చు]

2014లో టెలిఫోన్‌ హక్కుల రక్షణ

2015లో ఆరోగ్యవంతమైన ఆహారం

2016లో యాంటీబయాటిక్స్‌ రహిత ఆహారాలు కావాలి

2017లో విశ్వసనీయమైన డిజిటల్‌ ప్రపంచం

2018లో మెరుగైన డిజిటల్‌ విపణి

2019లో మన్నికైన స్మార్ట్‌ ఉత్పత్తులు

2020లో వినియోగదారుడి సుస్థిరత

2021లో ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిహరణ

2022లో న్యాయమైన డిజిటల్‌ ఫైనాన్స్‌ [5]

మూలాలు

[మార్చు]
  1. "The Times Group". epaperbeta.timesofindia.com. Archived from the original on 16 సెప్టెంబరు 2016. Retrieved 15 March 2020.
  2. Kennedy, John F. (15 March 1962). "John F. Kennedy: Special Message to the Congress on Protecting the Consumer Interest". presidency.ucsb.edu. Archived from the original on 14 సెప్టెంబరు 2018. Retrieved 15 March 2020.
  3. Brobeck, Stephen (1997). Encyclopedia of the consumer movement. Santa Barbara, Calif. [u.a.]: ABC-Clio. p. 176. ISBN 0874369878. Retrieved 15 March 2020.
  4. వార్త, అభిప్రాయాలు (16 March 2019). "మోసాల మార్కెట్లో వినియోగదారుడు". Archived from the original on 15 మార్చి 2020. Retrieved 15 March 2020.
  5. "మోసాల ఉచ్చులో కొల్లబోతున్న భరోసా". EENADU. Retrieved 2022-03-15.