ప్రపంచ శీతలీకరణ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం లోగో
తేదీ(లు)26 జూన్
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా
ప్రారంభించినది26 జూన్ 2019
వ్యవస్థాపకుడుస్టీఫెన్ గిల్
నిర్వహణప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్
వెబ్‌సైటు
worldrefrigerationday.org

ప్రపంచ శీతలీకరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్-పంప్ రంగాన్ని పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]

చరిత్ర[మార్చు]

ప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ ఇంగ్లాండులోని డెర్బీషైర్‌లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు 1824, జూన్ 26ను ఎంపికచేశారు.[2]

యునైటెడ్ కింగ్‌డమ్ రిఫ్రిజరేషన్ కన్సల్టెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజరేషన్ మాజీ అధ్యక్షుడు స్టీఫెన్ గిల్ ఆలోచనలోంచి ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం వచ్చింది. 2018, అక్టోబరులో ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థ ప్రపంచ శీతలీకరణ దినోత్సవానికి మద్దతునిచ్చింది.[3] ఈ సంస్థకు 2019, జనవరిలో అట్లాంటాలో గిల్ ఇట్స్ జాన్ ఎఫ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది.[4] 2019, ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన జాతీయ ఓజోన్ అధికారుల సమావేశంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మద్దతునిచ్చింది.[5] తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019, జూన్ 26న జరిగింది.

వార్షిక ప్రణాళికలు[మార్చు]

  1. 2019: వైవిధ్యం; అనువర్తనాల వైవిధ్యం, ప్రజలు, వృత్తులు, ప్రదేశాలు, సాంకేతికత, విజ్ఞానం, ఇంజనీరింగ్ పరిష్కారాలు, ఆవిష్కరణ
  2. 2020: కోల్డ్ చైన్; ఆహార భద్రత, భద్రత, మానవ ఆరోగ్యంలో కోల్డ్ చైన్ రంగం పాత్ర.[6]

మూలాలు[మార్చు]

  1. "About | World Refrigeration Day".
  2. "Refrigeration now has its own day of the year". iifiir.org. Retrieved 26 June 2020.[permanent dead link]
  3. "ASHRAE supports World Refrigeration Day | World Refrigeration Day".
  4. "Steve Gill wins ASHRAE international award". Cooling Post. January 16, 2019.
  5. "UNEP-OzonAction support for World Refrigeration Day | World Refrigeration Day".
  6. https://worldrefrigerationday.org/world-refrigeration-day-partners-release-the-cold-chain-4-life-celebration-kit/[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]