ప్రపంచ సంతోష సూచి - 2023
అంతర్జాతీయ ఆనంద దినోత్సవం ( వరల్డ్ హ్యాపీనెస్ డే ) మార్చి 20వ తేదీన పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి గోబుల్స్ సర్వే డేటా ఆధారంగా 2023 ఏడాదికి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును విడుదల చేసింది. మొత్తం 150 దేశాల్లోని డేటాలను పరిగణంలోకి తీసుకొని ఈ జాబితాను సిద్ధం చేసింది. సంతోష సూచీ - 2023లో భారత్ 126 స్థానంలో నిలిచింది[1]. పురుగు దేశాలైన చైనా - 64, నేపాల్ - 78, శ్రీలంక - 112, బంగ్లాదేశ్ - 118 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఆరోసారి మొదటి స్థానంలో నిలిచింది[2]. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్ దేశాలు నిలిచింది[3]. 2012 సంవత్సరం నుంచి ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ప్రతి ఏడాది ప్రపంచ సంతోషకర సూచి నివేదికను వెల్లడిస్తుంది. గత మూడేళ్ల వ్యవధిలో ఆయాదేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు, కుటుంబ జీవనం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాలను పరిగణంలోనికి తీసుకొని నివేదికను రూపొందిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Finland happiest country in the world, India ranked 126th: U.N. report". The Hindu (in Indian English). 2023-03-21. ISSN 0971-751X. Retrieved 2023-07-02.
- ↑ "సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక". Sakshi. 2023-03-26. Retrieved 2023-07-02.
- ↑ "India's Global Happiness Index rank should be 48, not 126: SBI Ecowrap". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2023-04-03. Retrieved 2023-07-02.