Jump to content

ప్రశాంత్ ఠాకూర్

వికీపీడియా నుండి
ప్రశాంత్ ఠాకూర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు వివేక్ పాటిల్
నియోజకవర్గం పన్వేల్

వ్యక్తిగత వివరాలు

జననం (1974-08-05) 1974 ఆగస్టు 5 (వయసు: 51)
పన్వేల్‌, మహారాష్ట్ర
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వర్షా ఠాకూర్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రశాంత్ రామ్‌షేత్ ఠాకూర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పన్వేల్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రశాంత్ ఠాకూర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005లో రాయ్‌గఢ్ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2006లో పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పన్వేల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడబ్ల్యూపి అభ్యర్థి బలరాం పాటిల్‌పై 12,961 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడబ్ల్యూపి అభ్యర్థి బలరాం పాటిల్‌పై 13,215 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ప్రశాంత్ ఠాకూర్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పన్వేల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడబ్ల్యూపి అభ్యర్థి హరేష్ మనోహర్ కేనిపై 92,730 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడబ్ల్యూపి అభ్యర్థి అభ్యర్థి బలరాం దత్తాత్రే పాటిల్‌పై 51,091 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
  4. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in ఇంగ్లీష్). 25 October 2019. ఒరిజినల్ నుండి 26 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2022.
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Maharastra Assembly Election Results 2024 - Panvel" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. the original నుండి 31 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2024.